Nani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. అయితే ఒక్కసారి స్టార్ హీరోగా పేరు సంపాదించుకోవాలంటే అహర్నిశలు కష్టపడుతూ మంచి సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే మాస్ హీరోలుగా మారి వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి నటుడు సైతం పుష్ప (Pushpa) సినిమాతో మాస్ హీరోగా మారిపోయాడు. మరి మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఆయన పుష్ప 2 సినిమాతో 50 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండియాలో తనకు ఎవరూ సాటి లేరు అనేంతలా గొప్ప గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాని కూడా అల్లు అర్జున్ బాటలోనే నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు గొప్ప విజయాలను అందుకున్నప్పటికి నిదానంగా ఆయన తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే దసర సినిమాతో మాస్ హీరోగా అవతారం ఎత్తిన ఆయన ఇప్పుడు హిట్ 3(Hit 3) సినిమాతో మరోసారి ప్రేక్షకుల్లో మాస్ ఇమేజ్ ని సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read : ‘హిట్ 3’ ట్రైలర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు!
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో మాస్ హీరోగా మారితే తనకు భారీ మార్కెట్ క్రియేట్ అవుతుందని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక హిట్ 3 సినిమాలో కూడా భారీగా వయోలెన్స్ ని వాడుతూ అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా చాలా కీలకంగా చిత్రించినట్టుగా తెలుస్తోంది.
మరి ఈ రెండు సినిమాల తర్వాత ఆయన మరోసారి ప్యారడైజ్ (Paradaise) సినిమాతో కూడా మాస్ హీరోగా మారే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక అల్లు అర్జున్ ఎప్పుడైతే పుష్ప సినిమాతో మాస్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక యంగ్ హీరోలందరూ కూడా అదే బాటలో నడవాలనే ప్రయత్నంలో ఉన్నారు.
ఇక అందులో భాగంగా నాని డేరింగ్ స్టెప్ వేసి మరి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ పాన్ ఇండియాలో మాస్ హీరోగా సక్సెస్ అయినట్టుగానే నాని కూడా అంతటి గొప్ప ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : గురుశిష్యుల ప్రేమ.. ధోని-పంత్ కామెడీ టైమింగ్ అదుర్స్