Odi World Cup 2023: సెమీస్ లో న్యూజిలాండ్ మీద ఒక్క మ్యాచ్ గెలిస్తే కప్పు మనదే…

ఇండియా అత్యుత్తమమైన టీమ్ గా గుర్తింపు పొందింది అయినప్పటికీ గత సెమీఫైనల్ మ్యాచ్ లలో జరిగిన అనుభవం అనేది ఇప్పుడు ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో సైకలాజికల్ గా మన ప్లేయర్స్ ని కొద్దివరకు డిసప్పాయింట్ చేస్తుంది.

Written By: Gopi, Updated On : November 14, 2023 12:07 pm

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ఇండియన్ టీం సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడడానికి రెడీ అవుతుంది.ఇక అందులో భాగంగానే ఇండియన్ టీమ్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో తలపడెందుకు కొన్ని వ్యూహలను అయితే రెడీ చేసుకుంటుంది. ఇక ప్రస్తుతం ఇండియన్ టీం లో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా మంచి ఫామ్ లో ఉండటం ఇండియన్ టీం కి బాగా కలిసి వచ్చే అంశం…ఇక ఇప్పుడు ఎక్కడ చూసిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ గురించే చర్చ జరుగుతుంది. ఎందుకంటే రెండు టీంలు కూడా 2019 వ సంవత్సరం వరల్డ్ కప్ సెమి ఫైనల్లో తలపడ్డాయి కాబట్టి ఇప్పుడు కూడా ఈ రెండు టీముల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది…

ఇక అందులో భాగంగానే ఈ మ్యాచ్ పైన రెండు టీమ్ లకి కూడా కొంచెం భయాలు అయితే ఉన్నాయి. ఇక ఈ విషయం పైననే ఇండియన్ వెటరన్ ప్లేయర్ అయిన దినేష్ కార్తిక్ మాట్లాడుతూ సెమీ ఫైనల్ లో కనక ఇండియన్ టీమ్ గెలిచినట్టయితే ఫైనల్ లో ఈజీగా గెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న టీమ్ ల్లో ఇండియా అత్యుత్తమమైన టీమ్ గా గుర్తింపు పొందింది అయినప్పటికీ గత సెమీఫైనల్ మ్యాచ్ లలో జరిగిన అనుభవం అనేది ఇప్పుడు ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో సైకలాజికల్ గా మన ప్లేయర్స్ ని కొద్దివరకు డిసప్పాయింట్ చేస్తుంది. ప్రస్తుతము న్యూజిలాండ్ కంటే ఇండియన్ టీమ్ చాలా బలంగా ఉన్నప్పటికీ ఈ సెమీఫైనల్ అనేది మాత్రం అందరికీ కొంచెం తడబాటుని సూచిస్తుంది.

అయినప్పటికీ ఇండియన్ టీమ్ సెమీఫైనల్ లో తప్పకుండా విజయం సాధిస్తుంది అంటూ తను ఇండియన్ టీం కి సపోర్ట్ చేస్తూనే ఇండియన్ టీం ఈ మ్యాచ్ లో గెలవాలంటే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే భారీ స్కోర్ చేసి ప్రత్యర్థి టీం ని కట్టడి చేయడంలో ఇండియన్ టీం ఎక్స్ పర్ట్ అందుకే ఈ మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ చేయాలి. ఇక ఇండియన్ టీం లో ఉన్న బౌలింగ్ విభాగం అత్యంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ప్రస్తుతం మొదట బ్యాటింగ్ తీసుకొని భారీ స్కోరు చేసి ఆ పరుగులను డిఫెన్స్ చేసుకుంటూ ఆడితే సరిపోతుంది అంటూ దినేష్ కార్తిక్ చాలా విలువైన మాటలను చెబుతూ ఇండియన్ టీమ్ ప్లేయర్లకి దైర్యాన్ని ఇచ్చాడు…

ఇక ఇది ఇక ఉంటే ఇప్పటికే లీగ్ దశ లో న్యూజిలాండ్ టీం మీద ఒక అద్భుతమైన మ్యాచ్ ఆడిన ఇండియన్ టీం ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ టీమ్ ని చిత్తు చిత్తు గా ఓడించింది. రచిన్ రవీంద్ర , డారియల్ మిచెల్ ఇద్దరు కొద్దిసేపు రాణించినప్పటికీ ఇండియన్ బౌలర్ల ముందు నిలబడలేకపోయారు.ఇక అదే సీను గనుక ఇప్పుడు రిపీట్ అయితే మాత్రం ఇండియన్ టీమ్ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…