Modi-Manda Krishna Madiga : ఒకనాడు చంద్రయాన్ విఫలమైనప్పుడు ఇస్రో చైర్మన్ ను ఓదార్చిన వైనం అందరినీ ఏమోషనల్ కు గురిచేసింది. ఇక రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సభలో మోడీ భావోద్వేగ దృశ్యం.. ఈనాడు జరిగిన మందకృష్ణను ప్రధాని మోడీ ఓదార్చిన వైనం దేనికి సాటి రాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మందకృష్ణ భావోద్వేగానికి చలించిపోయి మోడీ ప్రతిగా వ్యక్తం చేసిన ఏమోషన్ చరిత్రాత్మకంగా చెప్పొచ్చు..
మోడీ గుండెల్లో పెల్లుబుకినటువంటి ఉద్వేగ క్షణాలు.. భావాలు.. ఒకరిది 30 ఏళ్ల పోరాటం.. రెండొకరిది అది చూసి చలించిపోయిన మనస్తత్వం.. రెండూ కూడా దేనికి దానికే.. ఈ సన్నివేశాన్ని ఎలా వర్ణించినా సరిపోదు. ఇద్దరి ప్రసంగాలను మరీ మరీ వింటేనే నిజమైన అనుభూతి. మీడియాకు ఇంతటి మహత్తర సన్నివేశం తిరిగి వేయాలని అనిపించలేదు. తెలుగులో ఇంతకంటే పెద్ద సన్నివేశం ఇంకోటి ఉంటుందా? నిజంగానే ఈ సభ మాదిగల విశ్వరూప సభగా చెప్పొచ్చు..
తెలుగు రాష్ట్రాల్లోని మాదిగల సంకల్పం.. పోరాటానికి ఇది తార్కాణంగా చెప్పొచ్చు. మోడీ – మందకృష్ణ మాదిగల భావోద్వేగం ఓ అద్భుత చిరస్మరణీయ దృశ్యం అంటూ ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.