India Vs Afghanistan T20: ఇక ఇండియన్ టీమ్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో టి20 సిరీస్ ఆడటానికి సిద్ధమవుతుంది. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఈ టి 20 సిరీస్ కోసం ఆడే ప్లేయర్ల లిస్టు ని కూడా బిసిసిఐ వెల్లడించింది. అయితే ఇందులో రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లకి అవకాశాన్ని కల్పించారు. ఇక దాంతో పాటుగా కొంతమంది స్టార్ ప్లేయర్లకు విశ్రాంతిని ఇచ్చారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్ర లాంటి ప్లేయర్లకి విశ్రాంతిని అయితే ఇచ్చారు.
ఇక ఇప్పటికే వరల్డ్ కప్ కు ముందు ఆడబోయే చివరి టి20 మ్యాచ్ కావడంతో ఇందులో సత్తా చాటడానికి ప్రతి ప్లేయర్ కూడా ఆసక్తిని చూపిస్తున్నాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లను టీమ్ లోకి తీసుకోవడం పట్ల పలు రకాల విమర్శలు అయితే ఎదురవుతున్నాయి. ఇక ఇప్పటికే వీళ్లని సెలెక్ట్ చేయడం పట్ల ఇండియన్ టీమ్ మాజీ ప్లేయర్ అయిన దీప్ దాస్ గుప్తా స్పందించారు. ఆయన ఈ విషయం మీద మాట్లాడుతూ…
ఇంతకు ముందు సీనియర్ ప్లేయర్ల వల్లే మనకు టి 20 మ్యాచ్ ల్లో మైనస్ అవుతుందని భావించిన బిసిసిఐ మళ్లీ సీనియర్ ప్లేయర్లని టీం లోకి తీసుకురావడం కొంతవరకు బాధను కలిగిస్తుంది. వాళ్ల వల్ల యంగ్ ప్లేయర్స్ కి అవకాశాలు తగ్గిపోతున్నాయి అంటూ భావించిన బిసిసిఐ మళ్ళీ వీళ్లని ఎందుకు టీమ్ లోకి తీసుకుంది అంటూ ఆయన మాట్లాడారు అలాగే ఒక వంతు కు సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు టీం లో ఉండటం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా టీం కి యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ తెలియజేశాడు…
ఇక ఇదిలా ఉంటే టీం లో యంగ్ ప్లేయర్లు గా కొనసాగుతున్న రింకు సింగ్, తిలక్ వర్మ లాంటి స్టార్ ప్లేయర్లు టీం నుంచి అవకాశం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అంటూ తను తెలియజేశాడు. ఎందుకంటే ఇండియన్ టీమ్ లో స్టార్ ప్లేయర్లుగా ఉన్న హార్దిక పాండ్య, సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతానికి గాయలతో టీమ్ లోకి రాలేకపోయారు. వాళ్ళు లేకపోవడం వల్లే తిలక్ వర్మ, రింకు సింగ్ లకి టీమ్ లో ఆడే అవకాశాలు వస్తున్నాయి. ఒకవేళ సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇద్దరు కనక తిరిగి వచ్చినట్టయితే వీళ్ళిద్దరికీ టీం లో ఆడే అవకాశం అయితే ఉండదు. ఇక టి20 వరల్డ్ కప్ వరకు వాళ్లిద్దరూ టీమ్ లోకి వస్తారు కాబట్టి ఈ స్టార్ ప్లేయర్లు ఇద్దరికీ అవకాశాలు దక్కకపోవచ్చు అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు…
ఇక ఆఫ్గనిస్తాన్ తో సిరీస్ కి సూర్య కుమార్ యాదవ్, మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, రుతు రాజ్ గైక్వాడ్ గాయాల బారిన పడడం వల్ల వాళ్ళని టీం లోకి సెలెక్ట్ చేయలేదు…ఇక ఇప్పుడు ఇండియన్ టీమ్ అఫ్గాన్ పై తన సత్తా చాటి మరొక సిరీస్ ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది…