Samantha: సమంత జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకం. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ అయ్యింది. సమంత 2010లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆమె మొదటి చిత్రం ఏమాయ చేసావే. నాగ చైతన్య హీరోగా నటించాడు. ఆ మూవీ సూపర్ హిట్ కాగా, అనంతరం బృందావనం, దూకుడు చిత్రాలతో వరుస విజయాలు నమోదు చేసింది. 14 ఏళ్ళ కెరీర్లో సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. ఆమె అంచెలంచెలుగా ఎదిగారు.
ఈ స్థాయికి రావడానికి ఆమె ఎంత కష్టపడ్డారో తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకప్పటి తన కష్టాలు తలచుకుని సమంత కన్నీరు పెట్టుకున్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. పేరెంట్స్ బాగా చదువుకో అనేవారు. నేను చదువు విషయంలో చాలా శ్రద్ధగా ఉండేదాన్ని. కానీ ఆర్థిక ఇబ్బందులు కారణంగా చదువుకుంటూనే ఉద్యోగం చేయాల్సి వచ్చింది. పూట భోజనం కోసం కష్టపడాల్సి వచ్చింది.
ఒక ప్రక్క చదువుకుంటూ స్టార్ హోటల్ లో పనిచేశాను. అప్పుడు నాకు నెలకు రూ. 500 ఇచ్చేవారు. అదే నా మొదటి సంపాదన అని చెప్పుకొచ్చింది. సమంత తన అవసరాలకు కావాల్సిన డబ్బులు తానె సంపాదించుకునేది. మోడలింగ్ చేస్తూ చిన్న చిన్న యాడ్స్ లో నటించేది. అలా వచ్చిన డబ్బులు తన ఖర్చులకు, కుటుంబ అవసరాలకు వాడేదట. దర్శకుడు గౌతమ్ మీనన్ ఏమాయ చేసావే చిత్రంలో హీరోయిన్ కోసం ఆడిషన్స్ చేశారు. హాజరైన సమంతను ఆయన ఎంపిక చేశారు.
ఆ విధంగా సమంత హీరోయిన్ అయ్యారు. మొదటి చిత్రంతోనే అద్భుతమైన నటనతో సమంత అభిమానులను సంపాదించుకుంది. తన డెబ్యూ మూవీ హీరో నాగ చైతన్యను ప్రేమించిన సమంత 2018లో వివాహం చేసుకుంది. నాలుగేళ్లు కాపురం సవ్యంగానే సాగింది. 2021లో మనస్పర్థలతో విడిపోయారు. గత ఏడాది సమంత శాకుంతలం, ఖుషి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ఖాళీగా ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న సిటాడెల్ విడుదల కావాల్సి ఉంది.