https://oktelugu.com/

IND VS SA T20 Match : తిలక్ వర్మ.. చిలక్కి చెప్పినట్టు చెప్పాడు.. ఐనా వింటేగా.. పాపం అభిషేక్ శర్మ..

మొత్తానికి టి20 సిరీస్లో టీమిండియా దక్షిణాఫ్రికాపై పై చేయి సాధించింది. 2-1 తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. బుధవారం రాత్రి సెంచూరియన్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో టి20 మ్యాచ్లో 11 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 14, 2024 / 11:41 AM IST

    Abhishek Sharma

    Follow us on

    IND VS SA T20 Match :  ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ టి20 కెరియర్ లో తొలి సెంచరీ చేశాడు.. ఓపెనర్ సంజు 0 పరుగులకు ఔటైన తర్వాత తిలక్ వర్మ క్రీజ్ లోకి వచ్చాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే క్రమంలో అభిషేక్ శర్మ కూడా తన టి20 కెరియర్లో తొలి హాఫ్ సెంచరీ చేశాడు. వాస్తవానికి అభిషేక్ శర్మ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ తొలి రెండు మ్యాచ్లలో దారుణంగా విఫలమయ్యాడు. తొలి మ్యాచ్లో ఏడు, రెండో మ్యాచ్లో నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. అయితే మూడో మ్యాచ్లో మాత్రం క్రీజ్ లో నిలబడిపోయాడు. వేగంగా పరుగులు సాధించాడు. అయితే 9 ఓవర్లో ఔట్ అయ్యాడు. ఈ ఓవర్ లో తిలక్ వర్మ అతడికి ఓ చిట్కా చెప్పాడు. కానీ దానిని పాటించడంలో అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ సెంచూరియన్ మైదానంలో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. 200 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు. అతడు ఇన్నింగ్స్ లో మూడు ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఇదే దూకుడు కొనసాగించే క్రమంలో కేశవ్ మహారాజ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. కేశవ్ ఊరించే బంతివేయడంతో.. దానిని ముందుకొచ్చి కొట్టాలని అభిషేక్ శర్మ భావించాడు. కానీ ఆ బంతిని అమాంతం అందుకున్న కీపర్ క్లాసెన్ వికెట్లను పడగొట్టాడు. స్టంట్ అవుట్ గా అభిషేక్ శర్మను పెవిలియన్ పంపించాడు. ఫలితంగా అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ 50 పరుగుల వద్ద ముగిసింది.

    అవుట్ అయ్యేవాడు కాదేమో..

    అభిషేక్ శర్మ ఔట్ అయిన బంతికి ముందు తిలక్ వర్మ స్ట్రైకర్ గా ఉన్నాడు. ఆ ఓవర్ లో మూడో బంతిని ఎదుర్కొన్న తిలక్ వర్మ లాంగ్ ఆన్ లో షాట్ ఆడాడు. ఆ బంతికి రెండు పరుగులు సాధించాలని తీలకు వర్మ అనుకున్నాడు. మొదటి పరుగు వేగంగా తీసిన తిలక్ వర్మ.. అంతే వేగంతో రెండవ పరుగు సాధించాలని అనుకున్నాడు. అయితే రెండో పరుగుకు అభిషేక్ శర్మ ఒప్పుకోలేదు. దీంతో అభిషేక్ శర్మ స్ట్రైకర్ గా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ తిలక్ వర్మ చెప్పినట్టుగా అభిషేక్ శర్మ రెండవ పరుగుకు కూడా వచ్చి ఉంటే.. అభిషేక్ శర్మ పరిస్థితి మరో విధంగా ఉండేది.. అయితే అభిషేక్ శర్మ ఏకంగా ఏడు ఇన్నింగ్స్ తర్వాత హాఫ్ సెంచరీ చేశాడు. తన తొలి టి20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు. రెండో మ్యాచ్ లో సెంచరీ చేశాడు. అయితే ఆ తర్వాత ఎనిమిది మ్యాచ్ లు ఆడిన అతడు ఏడు ఇన్నింగ్స్ లలో ఒక హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. అయితే ఇన్నాళ్లకు అతడు హాఫ్ సెంచరీ చేసి తన మీద ఉన్న ఒత్తిడి మొత్తం తగ్గించుకున్నాడు.