https://oktelugu.com/

AP Cabinet Meeting : క్యాబినెట్ అత్యవసర భేటీ.. మహిళలకు ఫ్రీ బస్సు, అన్నదాత సుఖీభవ పై క్లారిటీ!

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈనెల 18న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అక్కడే కీలక నిర్ణయాలు తీసుకుని అసెంబ్లీలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : November 14, 2024 11:19 am

AP Cabinet Meeting

Follow us on

AP Cabinet Meeting :  కీలక నిర్ణయాలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని భావిస్తోంది.సూపర్ సిక్స్ పథకాలకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ..ప్రత్యేక మంత్రివర్గ సమావేశానికి సైతం చంద్రబాబు నిర్ణయించారు. కీలక అంశాలపై నిర్ణయంతో పాటు పలు నోటిఫికేషన్లకు ఆమోదం తెలపనున్నారు. వాలంటీర్ల అంశాన్ని తేల్చేయనున్నారు.108 ఉద్యోగుల అంశం, పథకాల అమలుపై ఒక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో అసభ్య సందేశాల నియంత్రణకు ఒక ప్రత్యేకంగా తీసుకొచ్చే చట్టానికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. మొన్ననే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.సంక్షేమ పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి క్యాబినెట్ సమావేశానికి నిర్ణయించారు. ఈనెల 18న నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ కొనసాగనున్న నేపథ్యంలో సభలో ఆమోదించాల్సిన బిల్లులపై ఒక నిర్ణయం తీసుకున్నారు.

* ప్రత్యేక చట్టం
ప్రధానంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, తప్పుడు ప్రచారాల నియంత్రణకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు.ఇప్పటికే దానిని రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లో ఏర్పాటుకు కూడా నిర్ణయించారు.ముఖ్యంగా మహిళలను కించపరిస్తే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలకు వీలుగా ఈ చట్టం తీసుకురానున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున కేసులు కూడా నమోదు అవుతున్నాయి.ఈ కొత్త చట్టం వస్తే సమూల మార్పులు సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

* పెండింగ్ అంశాలపై ఫోకస్
పెండింగ్ అంశాలపై కూడా దృష్టి పెట్టింది ప్రభుత్వం. ముఖ్యంగా వాలంటీర్ల కొనసాగింపు అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గత ఐదు నెలలుగా వాలంటీర్ల జీతాలు కూడా విడుదల చేయడం లేదు. బడ్జెట్లో కూడా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఇప్పుడున్న వాలంటీర్లలో కొంతమందిని విధుల్లోకి తీసుకొని.. నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.అదే సమయంలో సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా నిర్ణయాలు తీసుకొన్నారు.అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 20వేల నగదు సాయం,తల్లికి వందనం పథకం విషయంలో కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంశం కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో తేల్చేయునున్నట్లు తెలుస్తోంది.