T20 World Cup 2024 : అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈసారి మహిళల టి20 వరల్డ్ కప్ ను విభిన్నంగా నిర్వహించనుంది. గత సీజన్లలా కాకుండా.. పలు విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.. ఇప్పటికే అధికారిక గీతాన్ని విడుదల చేసింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది రోజుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా మహిళల టి20 వరల్డ్ కప్ మొదలుకానుంది. ఈసారి వరల్డ్ కప్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆడవాళ్లను మాత్రమే అంపైర్లుగా ఎంపిక చేసింది. మహిళలే మెగా టోర్నీ మ్యాచ్ ల బాధ్యతలు మొత్తం పర్యవేక్షిస్తారని ప్రకటించింది. దీనికిగాను పదిమంది మహిళ అంపైర్లను ఐసీసీ ఎంపిక చేసింది. వారు మాత్రమే కాదు మ్యాచ్ రిఫరీలుగా మహిళలనే ఎంపిక చేసింది.
వరల్డ్ కప్ మ్యాచ్ లకు అంపైరింగ్ కు ఎంపికైన వాళ్ళల్లో క్లెయిర్ పొలొసాక్ కు అత్యంత అనుభవం ఉంది. మన దేశానికి చెందిన జిఎస్ లక్ష్మి కి మ్యాచ్ రిఫరీగా అవకాశం లభించింది. ఆస్ట్రేలియా చెందిన ఆమె గతంలో నాలుగు సార్లు వరల్డ్ కప్ పోటీలకు అంపైరింగ్ చేశారు. గత వరల్డ్ కప్ లో రెడ్ ఫెర్న్ టీవీ ఎంపైర్ గా పని చేశారు. ఈసారి కూడా ఆమె అదే పాత్రను పోషిస్తారు. జింబాబ్వే దేశాన్ని చెందిన సారాహ్ దంబనబన తొలిసారి మహిళల వరల్డ్ కప్ కు అంపైర్ గా వ్యవహరించనుంది.
అంపైర్లుగా ఎంపికైంది వీరే..
జాక్విలిన్ విలియమ్స్, రెడ్ ఫెర్న్, పొలొసాక్, వృందా రది, షేరి డాన్, అన్నా హ్యారిస్, నిమలి ఫెరీరా.
మ్యాచ్ రిఫరీలు
లక్ష్మి, మిచెల్ ఫెరీరా, శాంద్రే ఫ్రిట్జ్..
కాగా, టి20 మహిళా వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని ఐసీసీ రూపొందించిన ప్రత్యేక గీతం అలరిస్తోంది. వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అనే టైటిల్ తో కూడిన ఈ పాట ఆకట్టుకుంటున్నది. ఈ పాటలో మన దేశ అమ్మాయిలు నిర్వహిస్తున్న విష్ బ్యాండ్ డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్నది. వచ్చే నెల మూడు నుంచి ఈ వరల్డ్ కప్ మొదలుకానుంది. కాగా, ఐసీసీ రూపొందించిన గీతం అద్భుతంగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ” మగవాళ్ళతో పోల్చితే ఆడవాళ్లు క్రికెట్ ఆడేది చాలా తక్కువ. అలాంటి వారిలో క్రికెట్ పై ఆసక్తిని పెంచేందుకు ఇలాంటి గీతాన్ని రూపొందించి ఐసీసీ గొప్ప పని చేసిందని కితాభిస్తున్నారు. ఈ గీతం ఆకట్టుకునేలా ఉందని.. అందులోని పదాలు ఆసక్తిని కలిగిస్తున్నాయని నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
&
Officials ready
An all-female panel to officiate at the Women’s #T20WorldCup 2024 ⬇#WhateverItTakeshttps://t.co/Tbywbzr2X3
— ICC (@ICC) September 24, 2024