https://oktelugu.com/

Buying a House : సొంత ఇల్లు కొనాలనుకునే వారంతా ముందు ఇది తెలుసుకోండి

కొందరేమో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఆ తరువాత కొద్ది రోజులకు ఇళ్లు నిర్మిస్తుంటారు. ఇంకొందరేమో నేరుగా నిర్మించిన ఇళ్ల వైపు మొగ్గుచూపుతుంటారు. ఇల్లు కొనేటప్పుడు ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది భవిష్యత్ కోసం స్థలాలు కొనుగోలు చేసి పక్కన పెడుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 25, 2024 / 04:27 AM IST

    Buying a House

    Follow us on

    Buying a House : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టంతో కూడుకున్న పనో ఆ ఇల్లు కట్టిన వాడికే తెలుస్తుంది. ఇల్లు సంపాదించుకోవడం ప్రతి ఒక్కరి కల. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆచితూచి అడుగువేయాల్సిన అవసరం ఉన్నది పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రూ.40 నుంచి రూ.50 లక్షలు పెడితే ఇల్లు వచ్చేది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా మారాయి. కోటి రూపాయలు పైన పెడితే కానీ ఇల్లు కొనలేం. మంచి ప్రైమ్ లోకేషన్‌లో ఇల్లు కొనుగోలు చేయాలంటే అంతకన్నా రెట్టింపు వెచ్చించాల్సిందే.

    కొందరేమో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఆ తరువాత కొద్ది రోజులకు ఇళ్లు నిర్మిస్తుంటారు. ఇంకొందరేమో నేరుగా నిర్మించిన ఇళ్ల వైపు మొగ్గుచూపుతుంటారు. ఇల్లు కొనేటప్పుడు ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది భవిష్యత్ కోసం స్థలాలు కొనుగోలు చేసి పక్కన పెడుతున్నారు. భవిష్యత్తులో ధరలు పెరిగి సేవింగ్స్ లాగా ఉపయోగపడుతుందని కలలు కంటున్నారు. పదేళ్ల తరువాత ఇంత పెరుగుతుంది.. ఇరవై ఏళ్ల తరువాత అంత పెరుగుతుందంటూ లెక్కలేసుకుంటున్నారు. అయితే.. అలా డిమాండ్ రావాలంటే మన కొన్న స్థలానికి మార్కెట్లో డిమాండ్ ఉండాలి. లేదంటే మనం కొన్న ఇల్లు మంచి సిటీలో ఉండాలి. అలాంటప్పుడు వాటికి భవిష్యత్తులో మంచి రేట్లు పలుకుతాయి.

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉన్న ధరలకు.. ఇప్పటి ధరలతో పోల్చితే భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. అలాగే.. రాష్ట్రం ఏర్పాటైన ఐదేళ్ల ధరలకు, ఇప్పటితో పోల్చినా అదే స్థాయిలో మార్పు కనిపిస్తోంది. అప్పటికి ఇప్పటికి ఏకంగా మూడింతల ధరలు పెరిగాయి. ఒక్క హైదరాబాద్‌లోనే తీసుకుంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8 శాతం నుంచి 12 శాతం వరకు ఇళ్లు, స్థలాల ధరలు పెరిగాయి. అయితే.. వచ్చే పదేళ్లలో ఏ స్థాయిలో పెరుగుతాయో కూడా ఊహించలేం. ఏడాదికి సుమారుగా 5 శాతం ధరలు పెరిగినా పదేళ్లకు చేరుకునే సరికి అది 50శాతానికి చేరుకుంటుంది. ఒకవేళ 15శాతం పెరిగితే.. అది 150 శాతానికి పెరుగుతాయని రియల్ ఎస్టేట్ వ్యాపార నిపుణులు సూచిస్తున్నారు. దాంతో భవిష్యత్తును ఒక్కసారి ఊహించుకుంటేనే ఆందోళన కలుగకమానదు. అయితే.. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈ వార్త సంతోషాన్నిచ్చేదే అని చెప్పాలి.

    ఈ లెక్క ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొంటే.. పదేళ్లలో అది మినిమం మూడు కోట్లు అయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. భవిష్యత్తులో భూముల ధరలను బేస్ చేసుకొని, నిర్మాణ ధరలనూ ప్రామాణికంగా తీసుకొని కూడా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అందుకే.. సొంతిల్లు కొనుక్కోవాలనుకునే వారు ఎంత తొరగా ఆ ప్లాన్ చేసుకుంటే అంత మంచిదని వారు సూచిస్తున్నారు. అదే సమయంలో చేతిలో డబ్బులు లేకుండా అప్పులు చేసి కొనాలనుకునే వారు ముందు వెనక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.