Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై అర్ధ్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోని లాభాలు రానున్నాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. అయితే కొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రావి వ్యాపారులు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి అడ్డంకులు తొలగిపోతాయి. విహార యాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు.
వృషభ రాశి:
జీవిత భాగస్వామికి బహుమతులు కొనుగోలు చేసతారు. బంధువుల నుంచి డబ్బు సాయం అందుతుంది. వ్యాపార అభివృద్ధిలో ఏదైనా అడ్డంకులు ఏర్పడితే నేటితో తొలగిపోతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.
మిథున రాశి:
వ్యాపారులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి:
కుటుంబంలో అవకతవకలు ఏర్పడుతాయి. జీవిత భాగస్వామికి బహుమతులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు పాటిస్తారు. కోర్టు కేసులు పెండింగులో ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది.
సింహారాశి:
ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. స్నేహితుల ద్వారా డబ్బు వస్తుంది. అదనపు ఆదాయం పొందడానికి మార్గాలు ఏర్పడుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.
కన్య రాశి:
వ్యాపారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి బిజీగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఖర్చులు పెరుగుతాయి.
తుల రాశి:
సామాజిక రంగాల్లో బిజీగా ఉంటారు. ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. శుభకార్యాక్రమాలపై చర్చలు జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓ ప్రత్యేక కార్యక్రమంలో బిజీగా ఉంటారు.
వృశ్చిక రాశి:
మానసిక ఒత్తిడి లేకుండా ఉంటారు. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. బంధువులతో వాగ్వాదాలు ఉంటాయి. ఉపాధి కోసం అద్భుతమైన అవకాశాలు పొందుతారు. ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు.
ధనస్సు రాశి:
వ్యాపారంలో దీర్ఘకాలిక పనులు పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి. సాయంత్రం కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.
మకర రాశి:
వ్యాపారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన పనులు పూర్తి చేస్తారు.
కుంభరాశి:
కొందరు శత్రువులు నుంచి జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితులను కలుస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆస్తి కొనుగోలు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కటుుం సభ్యులతో సరదాగా ఉంటారు. పాత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.