Indian cricket team ranking news: క్రికెట్ లో ఒకప్పుడు ఆస్ట్రేలియాది స్పష్టమైన ఆధిపత్యం కొనసాగేది. ఇప్పుడు ఆ స్థానాన్ని టీమిండియా ఆక్రమించింది. కొంతకాలంగా వైట్ బాల్ ఫార్మాట్ లో తిరుగులేని స్థాయిలో ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇందులో భారత జట్టు ఏకంగా 118 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో కొనసాగుతోంది. 113 పాయింట్లతో న్యూజిలాండ్ రెండవ స్థానంలో ఉంది. 109 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. గత ఏడాది మే నెల నుంచి ఆడిన మ్యాచ్ లకు పూర్తి వెయిటేజ్ ఇచ్చింది. అంతకుముందు రెండు సంవత్సరాల ఫలితాలకు సగం వెయిటేజ్ (50%) ఆధారంగా ర్యాంకింగ్ కల్పించింది. రోహిత్ నాయకత్వంలో టీం ఇండియా 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై విజయం సాధించింది టీమ్ ఇండియా.
టీ20 లలో కూడా టీం ఇండియా అదరగొడుతుంది.. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన విజయాన్ని అందుతుంది. ఏకంగా ట్రోఫీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు మీద సూపర్ విజయం అందుకుని.. ట్రోఫీని దక్కించుకుంది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. 2026లో సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. మొత్తంగా టీమ్ ఇండియా మూడుసార్లు టి20 వరల్డ్ కప్ లను సాధించింది. ఈ ఫార్మేట్లో మూడుసార్లు వరల్డ్ కప్ లు అందుకున్న జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.
టెస్ట్ ఫార్మేట్ లో టీమిండియా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇది టీమిండి అభిమానులను తీవ్రంగా కలవరపరుస్తోంది. ఈ ఫార్మేట్ లో కూడా టీమిండియా సత్తా చూపిస్తే.. ఇక తిరుగు ఉండదు. నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంటే.. అభిమానుల ఆనందానికి అవధి ఉండదు.. త్వరలోనే టీమ్ ఇండియా టెస్ట్ ఫార్మేట్ లో నెంబర్ వన్ స్థానాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.