ICC Champions Trophy
ICC Champions Trophy : ఐసీసీ ఛాంపియ్స్ ట్రోఫీ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి గ్రూప్–బి టాపర్‌గా నిలిచింది. గ్రూప్–ఏలో ద్వితీయ స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా(Australia)తో మ్యాచ్‌కు సిద్ధమైంది. దుబాయ్‌లో తొలి సెమీఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే ఫైనల్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఆస్ట్రేలియా గెలిస్తే ఫైనల్ మ్యాచ్ లాహోర్(Lahore)లో జరుగుతుంది. ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్‌లో టీమిండియాను ఓడించడం అంత ఈజీ కాదంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తాత్కాలిక సారథిగా స్మిత్ కూడా ఇదే మాట చెబుతున్నారు.
వరుణ్ చక్రవర్తి ఒక్కడితోనే కాదు..
దుబాయ్ వేదికగా భారత్–ఆస్ట్రేలియా మధ్య మంగళవారం తొలి సెమీఫైనల్ జరుగుతుంది. ఈ సందర్భంగా స్టీవ్ స్మిత్(Stive Smith) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత స్పిన్ దళం మొత్తం పటిష్టంగా ఉంది. అందుకే వరుణ్‌చక్రవర్తి ఒక్కడితోనే కాదు.. ఆ జట్టులోని మిగతా స్పిన్నర్లతోనూ ప్రమాదమే ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటామన్న విషయంపైనే ఈ మ్యాచ్‌లో గెలుపోటములు ఆధారపడి ఉంటాయి అని స్పష్టం చేశారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్పిన్ బౌలింగ్(Spin Bowling)ను ఎదుర్కోవడం క్లిష్టంగా మారుతుంది. అదే మాకు అతిపెద్ద సమస్య కాబోతోంది అని వెల్లడించారు. బౌలర్లపై ఎదురుదాడికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అని తెలిపాడు.
ప్రాక్టిస్‌కు సమయం..
టీమిండియా(Team India)తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టిస్‌కు మాకు రెండు రోజులు టైం దొరికింది అని స్మిత్ తెలిపాడు. రెండు రోజుల ముందు దుబాయ్‌కి చేరుకోవడం సానుకూల అంశంగా పేర్కొన్నారు. భారత్–న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం వచ్చే వరకు మేము ఏ వేదికపై ఆడాల్సి వస్తుందో తెలియలేదు అని పేర్కొన్నారు. అదృష్టవశాత్తు ఇక్కడే ఉండిపోవాల్సి రావడం కలిసి వచ్చింది. దుబాయ్ పిచ్‌ను అర్థం చేసుకునే సమయం దొరికింది అని తెలిపాడు.
దుబాల్‌లో టీమిండియా మ్యాచ్‌లు..
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్(Pakisthan) ఆతిథ్యం ఇస్తుంది. అయితే భద్రతా కారణాలతో టీమిండియా అక్కడకు వెళ్లలేదు. తటస్థ వేదిక అయిన దుబాయ్(Dubai)లో మ్యాచ్‌లు ఆడుతోంది. ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌ను ఓడించింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌లో తలపడనుంది. రెండో సెమీఫైనల్ సౌత్ ఆప్రికా–న్యూజిలాండ్ మధ్య బుధవారం మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్‌లోని గడాఫీ మైదానం ఇందుకు వేదిక అవుతుంది.
వరుణ్ మాయాజాలం
మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) వన్డేల్లో అరంగేట్రం చేశాడు. బట్లర్ బృందాన్ని 3–0తో టీమిండియా ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు టీ20 సిరీస్‌లోనూ అదరగొట్టాడు. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టుకు ఎంపికైన వరుణ్ తొలి రెండు మ్యాచ్‌లలో పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. న్యూజిల్యాండ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో దుమ్ము రేపాడు. తనకు చెత్త రికార్డు ఉన్న దుబాయ్‌లోనే అద్బుతం చేశాడు. పది ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ఓటమిని శాశించాడు.
Also Read : ఇదే జరిగితే సెమీ ఫైనల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్
జట్ల అంచనాలు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్డిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, ఆర్ద్రదీప్ సింగ్, హర్షిత్ రాణా.
ఆస్ట్రేలియా
జేక్ ఫ్రేజర్–మెక్క్ర్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, గ్లెన్ మాక్సె్వల్, బెన్ డ్వార్డుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, తన్వీర్ సంఘా, కూపర్ కన్నోలి.
Also Read : చారాణ కోడికి.. బారాణ మసాలా నూరింది.. పాపం పాకిస్తాన్