Heroine
Heroine : సినిమా పరిశ్రమలో రాణించడం అంత సులభం కాదు. టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి. హిట్ కొట్టినోళ్లకే స్టార్డం, కెరీర్ ఉంటుంది. ఆకర్షించే అందం ఉండి కూడా సక్సెస్లు లేక అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు నార్త్ భామ శ్రద్ధా దాస్. 37 ఏళ్ల ఈ భామ ఇంకా సింగిల్ స్టేటస్ అనుభవిస్తుంది. 1987 మార్చ్ 4న జన్మించిన శ్రద్ధా దాస్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. బెంగాలీ ఫ్యామిలీకి చెందిన శ్రద్దా దాస్ ముంబైలో పుట్టింది. ఆమె ఫాదర్ బిజినెస్ మెన్ కాగా, తల్లి డాక్టర్.
జర్నలిజం లో డిగ్రీ చేసింది. జర్నలిస్ట్ కావాలనుకున్న ఆమెకు నటనపై మక్కువ పెరిగింది. మోడలింగ్ చేసింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కండక్ట్ చేసిన వర్క్ షాప్స్ లో పాల్గొంది. కొని అడ్వేర్టైస్మెంట్స్ లో కూడా నటించింది. శ్రద్దా దాస్ కి తెలుగులో మొదటి అవకాశం వచ్చింది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. 2008లో విడుదలైన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మంచి విజయం అందుకుంది.
Also Read : పోలీసుల విచారణకు హాజరు కానున్న తమన్నా, కాజల్ అగర్వాల్..చిక్కుల్లో పడిన హాట్ బ్యూటీస్!
శ్రద్ధ దాస్ కి పెద్ద హీరోలతో జతకట్టే ఛాన్స్ రాలేదు. అల్లు అర్జున్, ప్రభాస్ వంటి చిత్రాల్లో ప్రాధాన్యత లేని పాత్రలు చేసింది. అవి సెకండ్ హీరోయిన్ కి తక్కువ, సపోర్టింగ్ రోల్ కి ఎక్కువ అన్నట్లు ఉండేవి. ఆర్య 2 మూవీలో హీరో మీద క్రష్ ఉన్న కొలీగ్ రోల్ చేసింది. ఇక డార్లింగ్ మూవీలో ప్రభాస్ కోసం సూసైడ్ చేసుకునే విలన్ కూతురు పాత్ర చేసింది. సుదీర్ఘమైన కెరీర్లో శ్రద్దా దాస్ హిందీ, బెంగాలీ, కన్నడ చిత్రాల్లో నటించింది. ఆమె ఇప్పటికీ అడపాదడపా చిత్రాలు చేస్తుంది.
గత ఏడాది శ్రద్ద దాస్ నటించిన పారిజాతపర్వం మూవీ విడుదలైంది. ప్రస్తుతం ఒక చిత్రంలో శ్రద్దా దాస్ నటిస్తుంది. శ్రద్దా దాస్ కి పెళ్లి ఈడు వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. ఆమె వివాహం చేసుకోలేదు. ఏజ్ బార్ లేడి బ్యాచ్ లర్ గా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.
Also Read : చీర కట్టులో ఆ దర్శకుడికి మైండ్ బ్లాక్ చేసిన అమ్మాయి, కట్ చేస్తే హీరోయిన్ ఆఫర్! ఇంతకీ ఈ హాట్ బాంబ్ ఎవరు?