Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ ఇండియా విజయ యాత్ర కొనసాగించింది. లీగ్ దశలో ఎదురైన మూడు మ్యాచ్లలో విజయం సాధించి.. గ్రూప్ – ఏ లో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకున్న భారత జట్టు.. చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై గెలిచి.. అత్యంత ఆత్మవిశ్వాసంతో సెమీ ఫైనల్ చేరుకుంది.
Also Read: తొలి ఓవర్ లో 8 పరుగులు ఇచ్చాడు.. ఆ తర్వాతే చుక్కలు చూపించాడు.. అదీ వరుణ్ చక్రవర్తి అంటే..
దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ లో స్కోర్ లోనూ 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టును మట్టి కరిపించింది. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ తలపడుతుంది. న్యూజిలాండ్ జట్టుతో ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిపోయింది. ఫలితంగా న్యూజిలాండ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముందుగా భారత్ బ్యాటింగ్ చేసి.. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 రన్స్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు ప్రారంభంలోనే బెంబేలెత్తించడంతో భారత్ స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ 79, అక్షర్ పటేల్ 42, హార్దిక్ పాండ్యా 45 పరుగులతో ఆకట్టుకున్నారు. వీరి ముగ్గురు టీమిండియా ఇన్నింగ్స్ కు కీలక స్తంభాలుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5/42 ఐదు వికెట్లు తీశాడు.. కైల్ జెమీసన్, విల్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలా ఒక వికెట్ పడగొట్టారు.
205 పరుగులకు ఆల్ అవుట్
అనంతరం 250 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 205 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కెన్ విలియమ్ సన్ 81 మినహా మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తి 5/42 తో అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. కులదీప్ యాదవ్ 2/56 తో అదరగొట్టాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్థిక్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు.. వరుణ్ చక్రవర్తి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
భారత్ గెలిచిన నేపథ్యంలో..
న్యూజిలాండ్ జట్టుపై గెలిచిన నేపథ్యంలో భారత్ గ్రూప్ ఏ లో టాపర్ గా నిలిచింది. తద్వారా ఆస్ట్రేలియాతో మంగళవారం తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. భారత్ గెలవడం ద్వారా న్యూజిలాండ్ జట్టు మళ్ళీ పాకిస్తాన్ వెళ్లక తప్పలేదు. గ్రూప్ బి లో దక్షిణాఫ్రికా టాపర్ గా ఉండగా.. దక్షిణాఫ్రికాతో గ్రూప్ – ఏ లో రెండవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ తలపడాల్సి ఉంటుంది. భారత్ హైబ్రిడ్ మోడ్ లో మ్యాచులు ఆడుతున్న నేపథ్యంలో.. ఒకవేళ న్యూజిలాండ్ జట్టు గెలిస్తే.. దక్షిణాఫ్రికా – భారత్ దుబాయ్ వేదికగా తలపడేవి. ఇప్పుడు భారత్ గెలిచింది కాబట్టి.. ఆస్ట్రేలియా కూడా దుబాయ్ లోనే ఉంది కాబట్టి.. మంగళవారం తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడం ద్వారా న్యూజిలాండ్ పాకిస్తాన్ ప్రయాణం కావాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా ప్రస్తుతం పాకిస్థాన్ లోనే ఉంది. ఒకవేళ భారత్ గనుక న్యూజిలాండ్ చేతుల్లో పడిపోతే దక్షిణాఫ్రికా దుబాయ్ రావాల్సి వచ్చేది.
Also Read: ఇదే జరిగితే సెమీ ఫైనల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్
The stage is set for the last 4️⃣ to compete for the next!
#ChampionsTrophy | ✍️: https://t.co/qd9rXYANc6 pic.twitter.com/Xke135eBef
— ICC (@ICC) March 2, 2025