Pakistan: లీగ్ నుంచే పాక్ ఇంటికి.. బాబర్ కు క్రొకోడైల్ ఫెస్టివలే

టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తన తొలి లీగ్ మ్యాచ్ అమెరికా చేతిలో ఆడింది.. సూపర్ ఓవర్ దాకా వెళ్లిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 15, 2024 2:20 pm

Pakistan

Follow us on

Pakistan: టి20 వరల్డ్ కప్ ఫేవరెట్ లలో పాకిస్తాన్ కూడా ఒకటి. ఈ టోర్నీకి ముందు ఆ జట్టుకు ఆ దేశ ఆర్మీతో శిక్షణ ఇచ్చారు. దాదాపు 15 రోజులపాటు పాకిస్తాన్ ఆటగాళ్లు ఆ దేశ ఆర్మీ ఆధీనంలో ఉన్నారు.. కొండలెక్కడం, ట్రెక్కింగ్ చేయడం, రకరకాల కసరత్తులతో తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ ను డ్రా గా ముగించుకుని పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్.. ఐర్లాండ్ చేతిలో ఒక టి20 మ్యాచ్ ఓడిపోయి.. మిగతా మ్యాచ్లు గెలిచి.. సిరీస్ దక్కించుకుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లోనూ ఓడిపోయి పరువు తీసుకుంది. అలాంటి జట్టు టి20 వరల్డ్ కప్ లో నూ అదే స్థాయిలో ఆట తీరు ప్రదర్శించింది.. అమెరికా లాంటి అనామక జట్టుపై కూడా ఓడిపోయింది. భారత్ విధించిన స్వల్పస్కోరును చేదించలేక చతికిల పడింది. దీంతో ఆ జట్టు సూపర్ -8 ఆశలు అడియాసలయ్యాయి.. కెనడాపై గెలిచినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. దీనికి తోడు అమెరికా – ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో మొత్తానికి పాకిస్తాన్ ఇంటికి వెళ్ళక తప్పలేదు.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాకిస్తాన్ కథ ముగిసిపోయింది.

టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తన తొలి లీగ్ మ్యాచ్ అమెరికా చేతిలో ఆడింది.. సూపర్ ఓవర్ దాకా వెళ్లిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అమెరికా కంటే మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టుతో ఆడిన మ్యాచ్ లోనూ పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో ఆ జట్టు ఆశలు ఆడియాసలయ్యాయి. చివరికి కెనడాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. ఐర్లాండ్ – అమెరికా జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ఐర్లాండ్ గెలిచి.. ఐర్లాండ్ జట్టుతో ఆడే మ్యాచ్ లోనూ గెలిచి సూపర్ -8 కు వెళ్లాలని పాకిస్తాన్ భావించింది. కానీ ఆ జట్టు ఆశలపై వర్షం నీళ్ళు చల్లింది. శుక్రవారం జరగాల్సిన ఐర్లాండ్ – అమెరికా మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో.. అమెరికా ఖాతాలో ఒక పాయింట్ నమోదయింది. మొత్తంగా ఐదు పాయింట్లతో ఆ జట్టు సూపర్ -8 కు వెళ్లిపోయింది. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ రెండు పాయింట్లను మాత్రమే సాధించింది. ఆ జట్టు తన తదుపరి మ్యాచ్ ఐర్లాండ్ తో ఆడుతుంది. అందులో గెలిచినప్పటికీ ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి.. అలాంటప్పుడు పాకిస్తాన్ సూపర్ -8 కు వెళ్లేందుకు అవకాశం ఉండదు.

సూపర్ -8 కు వెళ్లకుండా, గ్రూప్ దశలోనే పాకిస్తాన్ నిష్క్రమించడంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఆ జట్టు గతంలో తీసుకున్న సైనిక శిక్షణ, ఇతర తర్ఫీదులను నెటిజన్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ట్యాగ్ చేస్తున్నారు. ఒక రకంగా కబడ్డీ ఆడుకుంటున్నారు. ” టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ బాబర్ ఆజాం నాయకత్వంలో జట్టు విజయాలు సాధిస్తుందని స్టేట్మెంట్లు ఇచ్చింది. తీరా చూస్తే పరిస్థితి ఇలా ఉంది.. ఇక ఇప్పుడు బాబర్ అజాం కు చుక్కలు కనిపిస్తాయి.. అతడికి క్రొకోడైల్ ఫెస్టివల్ ఉంటుందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.