YCP: వైసిపి దేశంలో 5వ స్థానం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమి తిరుగులేని విజయం సాధించింది. దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది. 166 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాల్లో కూటమి పాగా వేసింది.

Written By: Dharma, Updated On : June 15, 2024 2:14 pm

YCP

Follow us on

YCP: వైసీపీకి స్వల్ప ఊరట. ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. గత ఎన్నికల్లో అంతులేని మెజారిటీతో దేశం యావత్తు ఏపీ వైపు చూసింది. ఇప్పుడు వైసీపీ ఓటమిని సైతం అదే పరిస్థితిలో చూస్తోంది. ఈ తరుణంలో వైసీపీకి ఉపశమనం కలిగించింది భారత ఎన్నికల సంఘం ప్రకటన. జాతీయస్థాయిలో ఎక్కువ ఓటు షేరింగ్ సాధించిన పార్టీలో వైసిపి ఐదో స్థానంలో నిలిచింది. బిజెపి మొదటి స్థానంలో నిలవగా.. ఆ తరువాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎస్పీ, బీఎస్పీ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఐదో స్థానంలో వైసిపి ఉంది. జాతీయస్థాయిలో 4.5% ఓట్లతో వైసిపి ఈ ఘనత సాధించింది. పొత్తులో భాగంగా టిడిపి 16 చోట్ల మాత్రమే గెలిచింది. కానీ 25 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది వైసిపి. నాలుగు చోట్ల మాత్రమే గెలిచింది. ఎనిమిది చోట్ల పొత్తులో భాగంగా టిడిపి పోటీ లేకపోవడంతో.. అత్యధిక ఓటింగ్ శాతం సాధించుకున్న పార్టీగా వైసీపీకి ఛాన్స్ దక్కింది. అయితే టిడిపి 17 చోట్లకు మాత్రమే పరిమితం కావడంతో.. 25 సీట్లలో వైసీపీకి వచ్చిన ఓటింగ్ శాతంతో.. ఆ పార్టీ పై చేయి సాధించగలిగింది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమి తిరుగులేని విజయం సాధించింది. దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది. 166 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాల్లో కూటమి పాగా వేసింది. టిడిపి ఒంటరిగానే 135 అసెంబ్లీ, 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అధికార వైసీపీ 11 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు పరిమితం అయ్యింది. ఈ ఎన్నికల్లో కూటమి మొత్తంగా 55.28% ఓట్లు సాధించడం విశేషం. వైసీపీకి 39.37% ఓట్లు పడ్డాయి. విడివిడిగా చూస్తే టిడిపికి 1,53,84,576 ఓట్లు పడ్డాయి. 45.60% ఓట్లను పొందగలిగింది. వైసీపీకి 1,32,84,134 ఓట్లు వచ్చాయి. 39.37% ఓట్లు నమోదు అయ్యాయి. టిడిపి వైసిపిల మధ్య తేడా కేవలం 21 లక్షల ఓట్లు మాత్రమే. కూటమిపరంగా చూస్తే దాదాపు 54 లక్షల ఓట్లు అన్నమాట.

అయితే భారత ఎన్నికల సంఘం గణాంకాలు ఇటీవల విడుదలయ్యాయి. 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన వైసీపీకి దక్కిన ఓట్లు, పొత్తులో భాగంగా 17 పార్లమెంట్ స్థానాల్లో టిడిపి పోటీ చేయగా దక్కిన ఓట్లతో సరిపోల్చుతూ ఈసీ లెక్కలు కట్టింది. పొందిన ఓట్ల శాతం లో వైసీపీ ముందంజలో ఉంది. ఓటింగ్ శాతం లో జాతీయస్థాయిలో ఐదో స్థానంలో నిలిచింది. భారీ ఓటమితో పుట్టెడు దుఃఖంలో ఉన్న వైసీపీ శ్రేణులకు ఇది ఊపిరి పోసే అంశమే. ఓట్ల పరంగా మంచి స్థితిలో వైసిపి ఉంది. అదే విషయాన్ని జగన్ సైతం చెబుతున్నారు. కోట్లాది కుటుంబాలు అండగా నిలిచిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ సభ్యులతో గట్టిగానే ఫైట్ చేద్దామని పిలుపునిస్తున్నారు. ఇటువంటి తరుణంలో భారత ఎన్నికల సంఘం వైసీపీకిటానిక్ లా పనిచేసే విషయాన్ని ప్రకటించింది.