https://oktelugu.com/

Team India Players : టీ 20 లలో టీమిండియా ఆటగాళ్ల పరుగుల వరద.. ఇప్పటివరకు ఎంతమంది సెంచరీలు చేశారో తెలుసా..

ఉప్పల్ మైదానం వేదికగా శనివారం రాత్రి బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన చివరిదైన మూడవ టి20 మ్యాచ్లో భారత అద్భుతమైన విజయం సాధించింది. సంజు శాంసన్ 111, సూర్య కుమార్ యాదవ్ 75 పరుగులతో . ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 297 రన్స్ చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 13, 2024 / 12:25 PM IST

    Team India Players

    Follow us on

    Team India Players : 297 పరుగుల టార్గెట్ చేజ్ చేసే క్రమంలో.. బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో సిరీస్ 3-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ భారీ విజయం ద్వారా భారత్ అనేక రికార్డులను కొల్లగొట్టింది. ఇంతకీ ఆ రికార్డులు ఏమిటో ఒకసారి పరిశీలిస్తే.. టి20 లలో టీమిండియా తరపున 2017లో శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్లో రోహిత్ శర్మ 35 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఇప్పటివరకు అదే రికార్డుగా ఉంది. బంగ్లాదేశ్ తో శనివారం జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ 40 బంతుల్లో సెంచరీ చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 2023 లో శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో 45 బంతులు ఎదుర్కొని సెంచరీ చేశాడు. సంజు దూకుడైన ఇన్నింగ్స్ తో సూర్య కుమార్ యాదవ్ రికార్డ్ మూడవ స్థానానికి వచ్చింది. ఇక కేఎల్ రాహుల్ వెస్టిండీస్ జట్టు పై 2016లో జరిగిన ఓ మ్యాచ్లో 46 బంతులు ఎదుర్కొని సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ జింబాబ్వే మెజార్టీతో 2024లో జరిగిన మ్యాచ్లో 46 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు ఇవే టాప్ 5 టి20 సెంచరీలుగా కొనసాగుతున్నాయి.

    వీరే కాకుండా..

    శుభ్ మన్ గిల్ 2023లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 63 బంతులు ఎదుర్కొని 126 పరుగులు చేసి, అజేయంగా నిలిచాడు.

    రుతు రాజ్ గైక్వాడ్ 2023 లో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో 57 బంతులు ఎదుర్కొని 123 పరుగులు చేసి, అజేయంగా నిలిచాడు..

    ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో 2022లో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 61 బంతులు ఎదుర్కొని 122 రన్స్ చేసి, అజేయంగా నిలిచాడు..

    రోహిత్ శర్మ 2024లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ఓ మ్యాచ్లో 69 బంతులు ఎదుర్కొని 121 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.

    శ్రీలంక జట్టుతో 2017 లో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 43 బంతులు ఎదుర్కొని 118 రన్స్ చేశాడు.

    సూర్య కుమార్ యాదవ్ ఇంగ్లాండ్ జట్టుపై 2022లో జరిగిన ఓ మ్యాచ్లో 55 బంతులు ఎదుర్కొని 117 రన్స్ చేశాడు.

    శ్రీలంక జట్టుపై 2023లో జరిగిన మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ 51 బంతులు ఎదుర్కొని 112 రన్స్ చేసి, అజేయంగా నిలిచాడు.

    2022లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ 51 బంతులు ఎదుర్కొని 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

    రోహిత్ శర్మ 2018లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 61 బంతులు ఎదుర్కొని 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు..

    2024లో బంగ్లాదేశ్ జట్టుపై జరిగిన ఓ మ్యాచ్లో సంజు శాంసన్ 46 బంతులు ఎదుర్కొని 111 పరుగులు చేశాడు.

    కేఎల్ రాహుల్ 2016లో వెస్టిండీస్పై జరిగిన మ్యాచ్లో 51 బంతులు ఎదుర్కొని 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు..

    2015లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన ఓ మ్యాచ్లో రోహిత్ శర్మ 66 బంతులు ఎదుర్కొని 106 రన్స్ చేశాడు.

    2022లో ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో దీపక్ హుడా 57 బంతుల్లో 104 రన్స్ చేశాడు..

    2018లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 54 బంతులు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ 101 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.

    2010లో సౌత్ ఆఫ్రికా జట్టుపై జరిగిన ఓ మ్యాచ్లో సురేష్ రైనా 60 బంతులు ఎదుర్కొని 101 రన్స్ చేశాడు.

    2018లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 56 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

    2023లో సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు..

    2024 లో జింబాబ్వే జట్టుతో జరిగిన ఓ మ్యాచ్లో అభిషేక్ శర్మ 47 బంతుల్లో సెంచరీ చేశాడు.