Siraj became the game changer: ఇంగ్లాండ్ మైదానాలపై బౌలింగ్ వేయడం అంత ఈజీ కాదు. పైగా ఆ ప్లాట్ మైదానాలపై బంతిని స్వింగ్ చేయడం కుదరదు. షార్ట్ పిచ్ బంతులు వేస్తే బ్యాట్ మీదకు వస్తాయి. అప్పుడు లెగ్ సైడ్ లేదా ఆఫ్ సైడ్ బంతులు వేయడమే బౌలర్లకు ఉపయుక్తం. అయితే అన్ని సందర్భాల్లో అలా బంతులు వేయడం కుదరదు. ఇలాంటి మైదానాలపై ఐదు వికెట్లు తీయడం అంటే అంత ఈజీ కాదు. కాని దానిని నిరూపించాడు మహమ్మద్ సిరాజ్. రూట్ ను బోల్తా కొట్టించాడు. స్టోక్స్ కు చుక్కలు చూపించాడు. ఇక లోయర్ ఆర్డర్ ను అయితే కనీసం కోలుకోనివ్వలేదు. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేశాడు. ఇక అతడి శరీర సామర్థ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంగ్లాండ్ గడ్డం మీద ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు సిరాజ్ నిర్విరామంగా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అతడు మైదానంలో ప్రాక్టీస్ కూడా విపరీతంగా చేస్తున్నాడు. చిన్న చిన్న గాయాలు అయినప్పటికీ ఏమాత్రం లెక్కపెట్టడం లేదు. పైగా అతడు ఎక్కడో హైదరాబాదులోని ఓ పేద కుటుంబం నుంచి ఇక్కడ దాకా వచ్చాడు. ఇక్కడదాకా రావడం.. అవకాశాలను అందుకోవడం ఎంత కష్టమో అతనికి తెలుసు. అందువల్లే అతడు ప్రతి మ్యాచ్లో 100% ఎఫర్ట్ చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు.
Also Read: బ్రూక్, స్మిత్.. 303 పరుగులు..ఇది కదా బజ్ బాల్ గేమ్ అంటే..గిల్ సేనకు ఏడుపొకటే తక్కువ!
2022 నుంచి ఇప్పటివరకు సుదీర్ఘ ఫార్మాట్లో సిరాజ్ ఆడుతూనే ఉన్నాడు. ఇప్పటివరకు అతడు 980 ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. ఇంతటి సుదీర్ఘమైన ప్రస్థానంలో అతడు అలసిపోయింది లేదు. గాయాల సాకులు చెప్పింది కూడా లేదు. శ్రీలంక మీద మొదలుపెడితే ఇంగ్లాండ్ వరకు ప్రతి జట్టు మీద తన ప్రతాపాన్ని చూపించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బి జి టి టోర్నీలో అతడు అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా థియేటర్లకు మాత్రం చుక్కలు చూపించాడు. సిరాజ్ ఆరు వికెట్లు తీశాడు కాబట్టి మీడియాలో అంత హైప్ రాలేదు. ఒకవేళ బుమ్రా కనుక ఈ రికార్డు సాధించి ఉంటే ప్రచారం వేరే విధంగా ఉండేది. సిరాజ్ లేకుండా గనక ఆడితే బుమ్రా యావరేజ్ 25. అదే సిరాజ్ జట్టులో ఉండి బౌలింగ్ చేస్తే బుమ్రా యావరేజ్ 33.. దీనినిబట్టి సిరాజ్ బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి సిరాజ్ కు విరాట్ కోహ్లీ విపరీతంగా అవకాశాలు ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాలను సిరాజ్ సద్వినియోగం చేసుకున్నాడు. ముఖ్యంగా శ్రీలంక మీద తన ప్రతాపాన్ని చూపించాడు. ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో కొత్త బంతితో సిరాజ్ మెరుపులు మెరిపించాడు.. ఇంగ్లాండ్ జట్టుపై ఐదు వికెట్.. ఆస్ట్రేలియా జట్టుపై ఐదు వికెట్లు.. సౌత్ ఆఫ్రికా జట్టుపై ఐదు వికెట్లు.. వెస్టిండీస్ జట్టుపై ఐదు వికెట్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇక న్యూజిలాండ్ పై కూడా 5 వికెట్ల ప్రదర్శన చేస్తే “సేన” జట్లపై ఐదు వికెట్లు సాధించిన టీమ్ ఇండియా బౌలర్ గా సిరాజ్ ఆవిర్భవిస్తాడు. సిరాజ్ ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన నేపథ్యంలో అతనిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో బుమ్రా ను జాకీలు పెట్టి లేపే బదులు సిరాజ్ కు విరివిగా అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు.