Kuldeep Yadav: తన బౌలింగ్ శైలితో భారత్ జట్టుకు ఎన్నో విజయాలను అందించడమే కాకుండా అందరి దృష్టిని తన వైపు ఆకర్షించిన స్టార్ బౌలర్ కుల్దీప్ యాదవ్. అయితే గత కొద్ది కాలంగా జట్టులో చోటు కోల్పోయి కనుమరుగైపోయాడు కుల్దీప్. ఎందుకో తెలియదు కానీ ఒక వెలుగు వెలిగిన కుల్దీప్ చాలా దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు…. ఐపీఎల్ కోల్కత్తా నైట్ రైడర్స్ ఒక సీజన్ మొత్తం అతన్ని ఆడించకుండా పక్కన పెట్టింది అంటే అతని పరిస్థితి ఎలా తయారయ్యిందో ఆలోచించండి.
జట్టు ఎంపిక చేసే సమయంలో భారత్ సెలక్టర్లు కూడా అతన్ని అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఏమైపోయాడో అని అందరూ ఆశ్చర్యపోయే సమయంలో సడన్గా ఇప్పుడు మూడు ఫార్మాట్లలో కులదీప్ టీం ఇండియాకు రెగ్యులర్ స్పిన్నర్ గా తిరిగి దర్శనం ఇచ్చాడు. అంతేకాదు వన్డే ప్రపంచ కప్ లో ఇండియా తరఫున కీలక బౌలర్గా ఈ ఉత్తరప్రదేశ్ కుర్రాడు బరిలోకి దిగుతున్నాడు.
గత రెండేళ్లుగా తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ.. చాలా కష్టపడ్డ కుల్దీప్ ఇప్పుడు తిరిగి ఫామ్ లోకి వచ్చాడు అంటే అది కేవలం అతను పడిన తపన మరియు చేసిన కష్టం ఫలితమే అని అతని చిన్ననాటి కోచ్ కపిల్ పాండే అన్నారు.
పతనావస్థ నుంచి కుల్దీప్ ఎలా పుంజుకున్నాడు అన్న విషయాన్ని అతని కోచ్ కపిల్ పాండే ,మాజీ స్పిన్నర్ సునీల్ జోషి వివరించారు.”ప్రతి ఆటగాడు చర్యలు ఒడిదుడుకులు అనేటివి సహజంగా వస్తూ ఉంటాయి. విజయానికి పొంగిపోకూడదు.. అపజయానికి కుంగిపోకూడదు.. ఎప్పటికప్పుడు తమ వంతు కృషి చేస్తూ మెరుగైన ప్రదర్శన కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. కుల్దీప్ ఇటు భారత జట్టు…అటు ఐపీఎల్ తరఫున ఆడే అవకాశం రాకపోవడంతో చాలా బాధపడ్డాడు. తన బౌలింగ్ వేగం పెంచడంతోపాటు అనేక అంశాలపై కసరత్తు చేశాడు.” అని కపిల్ పాండే అన్నారు.
కుల్దీప్ పై వేటు పడ్డప్పుడు సెలక్షన్ కమిటీలో సునీల్ జోషి కూడా ఉన్నారు. ప్రతిభావంతుడైన ఒక ఆటగాడు ఇలా కింద పడిపోవడం సరికాదు అని భావించిన అతను తన నేతృత్వంలో ,జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో కుల్దీప్ కు చోటు కల్పించారు. అక్కడ కుల్దీప్ అనేక సాంకేతిక అంశాల మీద దృష్టిసారించాడు. మోచేతి వేగం మీద నియంత్రణ తెచ్చుకోవడం తోపాటు వేగం పెంచడంతో బౌలింగ్ సైలిలో కూడా చాలా మార్పు వచ్చింది. అంతకుముందు ఎక్కడెక్కడో పడే బంతులు ఇప్పుడు స్థిరంగా అనుకున్న చోట గురి చూసి వేయగలుగుతున్నాడు. రికీ పాంటింగ్ కుల్దీప్ కు ఎంతో మద్దతు ఇచ్చాడు. అలాగే గతంలో ధోని హయాంలో కుల్దీప్ ఎంతో మెరుగయ్యాడు. అదే విధంగా రాబోయే ప్రపంచకప్ లో కూడా అతను కెప్టెన్
రోహిత్ ఆధారపడే బౌలర్లలో ఒకడు అవుతాడు.తన బౌలింగ్ నైపుణ్యం ప్రదర్శించి తిరిగి తానేంటో నిరూపించుకుంటాడు “అని
సునీల్ జోషి తెలిపాడు.
Web Title: How did kuldeep yadav come into the team after disappearing
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com