Telugu News » Sports » How did dhoni maintain with the seniors how did he win
MS Dhoni : ధోనీ సీనియర్లతో ఎలా మెయింటైన్ చేశాడు.. ఎలా గెలిపించారు.!
రెండు వరల్డ్ కప్ లు భారత జట్టు సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. ధోని జట్టుపై పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించినా, సీనియర్లకు తగిన గౌరవాన్ని అందించకపోయిన ఫలితం మరో విధంగా ఉండేది. కానీ, ధోని అలా చేయకుండా అందరినీ కలుపుకుని వెళ్లడం ద్వారా సత్ఫలితాలను సాధించగలిగాడు.
MS Dhoni : ఇండియన్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేక స్థానం ఉంది. భారత క్రికెట్ చరిత్రలో మరో కెప్టెన్ కు సాధ్యం కాని రీతిలో అపురూపమైన విజయాలను అందించిపెట్టాడు ధోని. ఒక 2007 లో టి20 వరల్డ్ కప్, 2011 లో వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు మూడుసార్లు ఆసియా కప్ విజేతగా భారత జట్టును నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు ధోని. అసలు మరో కెప్టెన్ కు సాధ్యం కాని రీతిలో విజయాలను ధోనీ ఎలా అందించి పెట్టాడు అన్నది ఇప్పటికీ చాలా మంది అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. అయితే, ధోనిలోని విలక్షణమైన శైలి, నాయకత్వ లక్షణాలే భారత జట్టును విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించాయని విశ్లేషకులు చెబుతుంటారు.
ఒక వ్యక్తి గొప్పగా రాణిస్తున్నాడు అంటే, పేరు ప్రఖ్యాతలు పొందుతున్నాడు అనుకుంటే అటువంటి చోట గ్రూపులు, వివాదాలు, ఆధిపత్య ధోరణి పెరిగిపోతుంది. క్రికెట్ లో అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. భారత్ లాంటి దేశాల్లో ఇది కొంచెం అధికంగానే కనిపిస్తుంది. భారత క్రికెట్ జట్టులోను గత కొన్నేళ్లుగా ఇదే విధమైన పరిస్థితి ఉండేది. జట్టు ఎప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి ఆట కొనసాగించేది. ఈ తరహా బేధాభిప్రాయాలు వల్ల భారత జట్టు బలంగా ఉన్నప్పటికీ గతంలో గొప్ప విజయాలను సాధించడంలో వెనుకబడిపోయింది. కానీ, మహేంద్ర సింగ్ ధోని భారత జట్టు పగ్గాలను అందుకున్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీనియర్ల, జూనియర్ల కలబోతతో వివాదాలకు దూరంగా ధోని భారత జట్టును ముందుకు నడిపించి గొప్ప విజయాలను అందించి పెట్టాడు.
సీనియర్ల సూచనలకు గౌరవం.. జూనియర్లకు సలహాలు..
2007 లో టి20 వరల్డ్ కప్ విజయం సాధించిన జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్.. వంటి వారంతా అప్పటికే క్రికెట్ జట్టులో సీనియర్లుగా చలామణి అవుతున్నారు. వీరితో పోల్చి చూస్తే ధోని జూనియర్. అయితే, జట్టులో గ్రూపులకు అవకాశం ఇవ్వకుండా అందరినీ ఏకతాటిపై నడిపించేలా ధోని తగిన జాగ్రత్తలు తీసుకునేవాడు. ముఖ్యంగా సీనియర్ క్రికెటర్ల సలహాలను తీసుకోవడం ద్వారా వారికి గౌరవాన్ని కల్పించి.. ఇబ్బందులకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడేవాడు ధోని. అదే సమయంలో జూనియర్లకు అవసరమైన సలహాలను, సూచనలను అందించేవాడు. ఈ విధంగా జూనియర్, సీనియర్ల కలబోతతో జట్టును ముందుకు నడిపించడం ద్వారా అద్భుతమైన విజయాలను సాధించాడు మహేంద్ర సింగ్ ధోని. 2011 వన్డే వరల్డ్ కప్ భారత జట్టు సాధించిందంటే దానికి కారణం సీనియర్లు, జూనియర్లు కలబోతతో ఉన్న భారత జట్టుగా చెప్పవచ్చు. వరల్డ్ కప్ ప్రయాణంలో కూడా ధోని ఎటువంటి ఇగోలకు పోకుండా సీనియర్ల గౌరవానికి విఘాతం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే వరల్డ్ కప్ విజయాన్ని సాధించగలిగాడు. ధోని కంటే ఎంతో అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లు భారత జట్టులో ఉన్నారు. వీరిలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ వంటి సీనియర్ ఆటగాళ్లు ధోని సారధ్యంలో ఆడారు. అయితే, ధోని వారి గౌరవానికి ఇబ్బంది కలిగించకుండా.. కీలక సందర్భాల్లో సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్ల సలహాలను తీసుకుంటూ జట్టును ముందుకు నడిపించాడు. దీనివల్ల జట్టులో గ్రూపులు కట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ధోని అంటే అందరివాడిగా జట్టులోని ప్రతి ఒక్కరూ భావించడంతో సమష్టిగా ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించి పెట్టారు. ఈ విధంగా ధోని ఆటగాడిగానే కాకుండా సారధిగాను తనలోని ప్రతిభ పాటవాలను ప్రదర్శించి రెండు వరల్డ్ కప్ లు భారత జట్టు సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. ధోని జట్టుపై పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించినా, సీనియర్లకు తగిన గౌరవాన్ని అందించకపోయిన ఫలితం మరో విధంగా ఉండేది. కానీ, ధోని అలా చేయకుండా అందరినీ కలుపుకుని వెళ్లడం ద్వారా సత్ఫలితాలను సాధించగలిగాడు.