Hardik Pandya: ముంబై ఇండియన్స్ టీమ్ లోకి వచ్చిన హర్థిక్ పాండ్య…దీని వెనక ఇంత కథ జరిగిందా..?

ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ముంబై టీం గతః సంవత్సరం భారీ డబ్బులతో కొనుగోలు చేసిన కెమరన్ గ్రీన్ ని బెంగళూరు టీం కి అమ్మేసింది. దాంతో పూర్తి సొమ్ముని చెల్లించి బెంగళూరు టీమ్ కెమరన్ గ్రీన్ సొంతం చేసుకుంది.

Written By: Gopi, Updated On : November 27, 2023 12:27 pm
Follow us on

Hardik Pandya: ఐపీఎల్ 2024 కి సంబంధించిన మినీ ఆక్షన్ డిసెంబర్ 19వ తేదీన దుబాయ్ వేదికగా చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇక ఈ క్రమంలోనే గుజరాత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్య ని ఇప్పటికే ముంబై టీం తమ టీమ్ లోకి తీసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ టీం ఫ్యూచర్ కెప్టెన్ గా కూడా మార్చాలని చూస్తుంది. ఇక ఈ క్రమంలోనే హార్థిక్ పాండ్యా ని తమ టీం లోకి తీసుకుంటుంది అని చాలా రోజుల నుంచి వార్తలైతే వస్తున్నాయి…

ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ముంబై టీం గతః సంవత్సరం భారీ డబ్బులతో కొనుగోలు చేసిన కెమరన్ గ్రీన్ ని బెంగళూరు టీం కి అమ్మేసింది. దాంతో పూర్తి సొమ్ముని చెల్లించి బెంగళూరు టీమ్ కెమరన్ గ్రీన్ సొంతం చేసుకుంది.ఇక దీంతో వచ్చిన మనీ ని హార్దిక్ పాండ్యా మీద ఇన్వెస్ట్ చేసి ముంబై ఇండియన్స్ టీమ్ అతని టీం లోకి తీసుకుంది. ఇలా ముంబై టీమ్ గుజరాత్ టీమ్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్య ను తీసుకోవడం పట్ల ముంబై ఇండియన్స్ అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇదే క్రమంలో గుజరాత్ మాత్రం అభిమానులు మాత్రం తీవ్రమైన నిరాశ లో ఉన్నారని తెలుస్తుంది.

ఎందుకంటే ఇప్పటికి రెండు సీజన్ లలో గుజరాత్ టీమ్ కి ఒకసారి కప్పును అందించి సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే ఈ ఇయర్ కూడా గుజరాత్ ని ఫైనల్ కీ చేర్చాడు అడుగు దూరంలో గుజరాత్ టీమ్ ఓడిపోవడం తో అలాంటి కెప్టెన్ టీం ని వదిలేసి వెళ్లిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అంటూ గుజరాత్ అభిమానులు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు…

అలాగే పాండ్యా కోసం రోహిత్‌ను ట్రేడ్ చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ వాటిలో నిజం లేదు.ఎందుకంటే ముంబై టీమ్ రోహిత్ శర్మ ను వదిలేసుకొనే ప్రసక్తి లేదు అని మరోసారి తెలియజేసింది…ఇక వీళ్ళ తో పాటు డిసెంబర్ 19 వ తేదీన జరిగే మినీ ఆక్షన్ లో మిగిలిన టీమ్ లు కూడా చాలా మంది ప్లేయర్లను తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ క్రమం లోనే ఈసారి వన్డే వరల్డ్ కప్ లో సత్తా చాటిన ప్లేయర్లను ఐపీఎల్ లో తీసుకునే అవకాశాలు ఉన్నాయి…