Tollywood: ఒక్క పాట కోసం 365 రోజులు హౌస్ ఫుల్ నడిచిన థియేటర్.. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసా?

సినిమా మొత్తానికి కాకుండా ఒక్క పాట చూడడం కోసం థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యేవంటే అతిశయోక్తి కాదు. అయితే కృష్ణ వంశీ దర్శకత్వంలో బాబు మోహన్ సౌందర్య నటించిన...

Written By: Neelambaram, Updated On : November 27, 2023 12:42 pm
Follow us on

Tollywood: థియేటర్లలో ప్రస్తుతం ఒక సినిమా వారం కంటే ఎక్కువగా ఆడడం లేదు. ఒక వేళ వారం మించి సినిమా ఆడిందంటే కచ్చితంగా అది స్టార్ హీరోల సినిమానే అవుతుంది. కానీ ఒకప్పుడు మాత్రం నెలలు నెలలు నడిచేవి సినిమాలు. వంద రోజులు పక్కా అనేవారు. కానీ ఇప్పుడు హిట్ అంటున్నారు కానీ వంద రోజులు ఆడడం కష్టం అనే చెప్పాలి. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా నెల దాటడం గగనమే. కానీ ఒకప్పుడు సంవత్సరం కూడా ఆడేవి సినిమాలు. అయితే థియేటర్లలో హౌస్ ఫుల్ అయ్యే సినిమాలు పాట వల్ల కూడా హిట్ అయ్యేవి. పాట కోసం కూడా సినిమాలకు వెళ్లేవారు.

సినిమా మొత్తానికి కాకుండా ఒక్క పాట చూడడం కోసం థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యేవంటే అతిశయోక్తి కాదు. అయితే కృష్ణ వంశీ దర్శకత్వంలో బాబు మోహన్ సౌందర్య నటించిన చినుకు చినుకు అందెలతో అనే పాట ఇప్పటికీ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పాటలో బాబు మోహన్ తో కలిసి సౌందర్య నటించడం అప్పట్లో అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. ఇక బాబు మోహన్ ఓ ఇంటర్య్వూలో ఈ పాట గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సౌందర్యతో ఈ పాటలో నటించడం అదృష్టమని.. ఈ పాట 365 రోజుల పాటు థియేటర్లలో హౌస్ ఫుల్ రికార్డు సొంతం చేసుకుందన్నారు.

బాబు మోహన్ ఓ థియేటర్ వద్దకు సెకండ్ షోకు వెళ్తే థియేటర్ ముందు తనది, సౌందర్యది పెద్ద కటౌట్ ఏర్పాటు చేశారట. దీంతో నా జన్మ ధర్య అయిందని.. దీనికి మించి ఇంకేం కావాలి అనుకున్నానని తెలిపారు. అంతే కాదు 365 రోజులు అని చూసి మరింత సంతోషం, ఆశ్యర్యం వేసిందన్నారు. అయితే నమ్మలేకపోయిన బాబు మోహన్.. మేనేజర్ దగ్గరకు వెళ్లి అడిగారట. అయితే ఇద్దరు థియేటర్ లోపలికి వెళ్లి చూస్తే అక్కడక్కడ 50 మంది కనిపించారట. ఇదేంటి అని అడిగితే.. వెయిట్ చేయండి అన్నారట మేనేజర్. ఇక చినుకు చినుకు అనే సాంగ్ రావడంతో వెంటనే హౌస్ ఫుల్ అయిందట.. ఆ పాట అయిపోయిన తర్వాత తిరిగి వెళ్లిపోయారట.

ఈ రిజల్ట్ ను చూసి బాబు మోహన్ చాలా సంతోషపడ్డారట. అయితే సౌందర్యకు బాబు మోహన్ తో నటించవద్దని కొందరు చెప్పారట. అయినా ఆమె వినకుండా నాతో నటించిందని ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఎంతో మంచి అమ్మాయి మరణించడం చాలా బాధాకరం అని తెలిపారు.