Nara Lokesh: ఆర్జీవి ‘వ్యూహం’ను దెబ్బ కొట్టిన లోకేష్

ఆర్జీవి విభిన్న రీతిలో తెరకెక్కించడంతో చిత్రంపై అంచనాలు పెరిగాయి. పొలిటికల్ దుమారం రేగుతోంది. ఈ చిత్రాన్ని రెండు పార్ట్లుగా విడుదల చేయనున్నట్లు ఇదివరకే రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. వ్యూహం చిత్రాన్ని నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Written By: Dharma, Updated On : November 27, 2023 12:21 pm
Follow us on

Nara Lokesh: రాంగోపాల్ వర్మ.. సంచలన దర్శకుడు అనేకంటే వివాదాల డైరెక్టర్ అంటేనే ఆయన ఇష్టపడతారు. నలుగురికి నచ్చినది.. తనకు మాత్రం నచ్చదు అన్న రీతిలో వ్యవహరిస్తుంటారు. అందుకే ఆయన పరిచయాన్ని అలా చెప్పాల్సి వస్తోంది. ఎన్నో రాజకీయ నేపథ్యం కలిగిన చిత్రాలను తీసిన రాంగోపాల్ వర్మ.. ఏపీ రాజకీయాల నేపథ్యంలో ” వ్యూహం” అన్న చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మొదలుకొని.. జగన్ ఓదార్పు యాత్ర, అనంతరం సీఎం పదవి చేపట్టే వరకు జరిగిన పరిణామాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

ఇది తెలిసిన విషయమే అయినా.. ఆర్జీవి విభిన్న రీతిలో తెరకెక్కించడంతో చిత్రంపై అంచనాలు పెరిగాయి. పొలిటికల్ దుమారం రేగుతోంది. ఈ చిత్రాన్ని రెండు పార్ట్లుగా విడుదల చేయనున్నట్లు ఇదివరకే రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. వ్యూహం చిత్రాన్ని నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రంలో తమను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ టిడిపి యువ నాయకుడు లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. దీంతో సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించింది. రాజకీయంగా కించపరిచే ఉద్దేశంతో ఈ సినిమా తీసినట్లు ఏకీభవించింది. అందుకే ఆ సన్నివేశాలు విషయంలో అభ్యంతరాలు తెలుపుతూ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వలేదు.

తన సంచలన వ్యాఖ్యలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆర్జీవి విషయంలో లోకేష్ గట్టి షాక్ ఇచ్చినట్టే అయింది. చివరకు ఈ సినిమా విడుదలకు ఆర్జీవి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కోర్టు సైతం తెలంగాణ ఎన్నికల తరువాత విచారణ చేపడతామని చెప్పుకు రావడం విశేషం. వైసిపి తో పాటు జగన్ కు సంబంధించి అన్ని కేసులు వాదించే ఎంపీ నిరంజన్ రెడ్డి…వ్యూహం సినిమా విడుదలకు సంబంధించి కేసును వాదించడం విశేషం.అయితే కోర్టు ఆదేశాలు చూస్తుంటే డిసెంబర్ లోనే వ్యూహం సినిమా విడుదలపై ఏదో ఒక అప్డేట్ వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికల ముంగిట వ్యూహం సినిమాకు సంబంధించి రెండు పార్టీలను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. వైసీపీకి మద్దతుగా ఈ సినిమా తీశారన్నది బహిరంగ రహస్యమే. ఒకటి రెండుసార్లు ఆర్జీవి తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లి సీఎం జగన్ కలిశారు. ఇందులో పాదయాత్ర సన్నివేశాలను ఏకంగా విజయవాడలోని ప్రధాన కేంద్రాల్లో చిత్రీకరించారు. ప్రజా జీవితానికి విఘాతం కలిగించి మరి అనుమతులు మంజూరు చేశారు. పాదయాత్ర ఘట్టాలను చిత్రీకరించేందుకు విజయవాడలోని భారీ వంతెన వద్ద ట్రాఫిక్ ను బ్లాక్ చేశారు. అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలకు సిద్ధమైన ఈ సినిమా.. లోకేష్ దెబ్బకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ విషయంలో కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో? సెన్సార్ బోర్డు ఎటువంటి చర్యలు చేపడుతుందో? చూడాలి.