Hardik Pandya : ఐపీఎల్ (IPL) లో భాగంగా ప్రస్తుతం 18వ ఎడిషన్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకైతే పాయింట్ల పట్టికలో కింగ్స్ 11 పంజాబ్ ప్రథమ స్థానంలో ఉంది. ఢిల్లీ జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. అధమ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉంది. ఇక ఈ ఐపిఎల్ లో అత్యధిక ట్రోఫీలు సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సమానంగా కొనసాగుతోంది. అయితే గత మూడు సీజన్లుగా ఈ జట్టు ఆశించిన స్థాయిలో ఆట తీరు కొనసాగించలేకపోతోంది. ఈ నేపథ్యంలో గత సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సి స్థానం నుంచి రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యాను నియమించింది. అయినప్పటికీ ముంబై జట్టు చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు సాధించలేదు.. గత సీజన్ లో గ్రూప్ దశ నుంచే ముంబై ఇండియన్స్ జట్టు నిష్క్రమించింది. అయితే ఈసారి గొప్ప ఆట తీరు ప్రదర్శిస్తామని.. అద్భుతంగా ఆడతామని కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రకటించాడు. కానీ అతని మాటలకు.. ఆటగాళ్లు ఆడుతున్న తీరుకు పొంతన ఉండడం లేదు.
Also Read : హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈమెనే!
బుర్ర పనిచేస్తున్నదా
శుక్రవారం లక్నో వేదికగా లక్నో జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడింది. ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్లో లక్నో జట్టు 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐదు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో 16 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో 28 పరుగులు చేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కెప్టెన్ గా అతడు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ఫామ్ లో లేడు అనే సాకు చూపించి.. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ ను పక్కన పెట్టారు. అతని మోకాలికి గాయమైందని.. అందువల్లే తుది జట్టులో అతడిని కొనసాగించలేకపోతున్నామని హార్థిక్ పాండ్య ప్రకటించాడు. ఇది రోహిత్ అభిమానులను తీవ్రంగా కలతకు గురిచేసింది. దీంతో సోషల్ మీడియాలో #hurt అనే యాష్ ట్యాగ్ ను రోహిత్ అభిమానులు ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఇక చివరి ఓవర్ లో ముంబై జట్టుకు 22 పరుగులు కావలసిన సమయంలో అనూహ్యంగా తిలక్ వర్మ ను రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి పంపించారు. అప్పటికి తిలక్ వర్మ 23 బంతుల్లో రెండు ఫోర్ల సహాయంతో 25 పరుగులు చేశాడు. తిలక్ వర్మ భారీగా పరుగులు చేయలేకపోతున్నాడు అనే కారణాన్ని చూపించి అతన్ని రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి పంపించడంలో హార్దిక్ పాత్ర ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో శాంట్నర్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించారు. కానీ అతడు రెండు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేశాడు. ఇక చివరి ఓవర్ ను లక్నో బౌలర్ ఆవేష్ ఖాన్ కట్టుదిట్టంగా వేశాడు. కేవలం పది పరుగులు మాత్రమే ఇచ్చాడు.. హార్దిక్ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు సోషల్ మీడియాలో పలుచన చేస్తున్నాయి. అంతేకాదు రోహిత్, తిలక్ వర్మ అభిమానులైతే హార్దిక్ పాండ్యాకు బుర్ర లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : విరాట్ కోహ్లీని అధిగమించిన హార్దిక్ పాండ్యా.. వామ్మో ఈ క్రేజ్ ఏందయ్యా బాబూ..