Hardik Pandya: 2024 ఐపిఎల్ కోసం ఇప్పటికే అన్ని టీమ్ లు రెఢీ అవుతున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ఐపిఎల్ లో రోజుకొక ట్విస్ట్ జరుగుతుంది. ఇప్పటికే ముంబై టీమ్ రోహిత్ శర్మ ని కెప్టెన్ గా తప్పించి హార్దిక్ పాండ్య ని కెప్టెన్ గా నియమించింది. అయినప్పటికీ హార్థిక్ పాండ్య టీమ్ లోకి ఎప్పుడు వస్తాడు అనే విషయం మీద క్లారిటీ అయితే లేదు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే ఆయన ఐపిఎల్ ఫస్ట్ ఆఫ్ లో జరిగే మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నట్టు గా తెలుస్తుంది.
మరి ఈ మ్యాచ్ లకి రోహిత్ శర్మ ను కెప్టెన్ గా చేస్తారా లేదా మరి వేరే వ్యక్తిని కెప్టెన్ గా చేస్తారా అనే విషయాల మీద క్లారిటీ లేదు. ఇక ఆల్రెడీ రోహిత్ శర్మని కెప్టెన్ గా తప్పించారు. కాబట్టి మళ్ళీ అతన్ని ఇప్పుడు కెప్టెన్ గా చేసే అవకాశాలు అయితే లేవు. మరి ఆయన్ని కాదని టీంలో కెప్టెన్ గా వ్యవహరించే సత్తా ఉన్న ప్లేయర్లు ఎవరున్నారు అనేదానిమీద ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీం ఆర తీస్తున్నట్టు గా తెలుస్తుంది.
అయితే ఈ టీమ్ లో సూర్య కుమార్ యాదవ్ లాంటి ఒక స్టార్ ప్లేయర్ ఉన్నప్పటికీ తను కెప్టెన్ గా ఏ మేరకు రాణిస్తాడు అనే ఆందోళనలో ముంబై ఇండియన్స్ టీమ్ యాజమాన్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా సౌతాఫ్రికా మీద జరిగిన టి20 సిరీస్ ని సక్సెస్ ఫుల్ సమం చేశాడు. అయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ మీద ముంబై ఇండియన్స్ టీమ్ పూర్తి కాన్ఫిడెంట్ గా అయితే లేదు. అందుకే టీం కి కెప్టెన్ గా ఎవరిని చేస్తే బాగుంటుందనే విషయంలోనే వాళ్ళు బాగా ఆలోచిస్తున్నట్టు గా తెలుస్తుంది.
ఇక మరికొందరు మాత్రం ఈ సీజన్ కి రోహిత్ శర్మ ని కెప్టెన్ గా ఉంచితే బాగుండేది. తొందరపడి హార్థిక్ పాండ్య ని కెప్టెన్ గా నియమించి ముంబై ఇండియన్స్ టీం తప్పు పని చేసింది. ఈ ఒక్క సీజన్ అయిపోయాక వచ్చే సీజన్ నుంచి హార్థిక్ పాండ్య ని కెప్టెన్ చేస్తే బాగుండేదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇక ఇప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ టీమ్ కి కెప్టెన్ కష్టాలు అయితే తప్పడం లేదు…చూడాలి మరి ఈ సీజన్ లో కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కి అవకాశం ఇస్తారా లేదా అనేది…