Hardik Pandya: నటాషాకు చిల్లి గవ్వ వెళ్లకుండా హార్దిక్ ప్లాన్.. వజ్రాన్ని వజ్రం తోనే కోయడం అంటే ఇదే కాబోలు..

హార్దిక్ పాండ్యా, తన సోదరుడు కృనాల్ పాండ్యా తో కలిసి ముంబైలోని లోయర్ పరేల్ అనే ప్రాంతంలో మూడు జోడి అపార్ట్మెంట్లను రెంట్ కు తీసుకున్నాడు. వీటికి ప్రతినెలా 7.75 లక్షల అద్దెను చెల్లిస్తున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 1, 2024 9:25 am

Hardik Pandya

Follow us on

Hardik Pandya: “అతడు ముంబై జట్టు కెప్టెన్ అయినప్పుడు శుభాకాంక్షలు చెప్పలేదు. అతడు ఆడుతున్నప్పుడు మైదానంలోకి రాలేదు. చివరికి అతడు ఆమె జన్మదినం సందర్భంగా విషెస్ కూడా చెప్పలేదు. అంటే వారు విడాకులు తీసుకున్నారు.. ఆమెకు భరణంగా 70 శాతం ఆస్తులు రాసిచ్చాడు” ఇదీ గత కొద్దిరోజులుగా హార్దిక్ పాండ్యా, నటాషా కు సంబంధించి మీడియాలో ప్రసారమవుతున్న వార్త.. ఇంతకీ వారు విడాకులు తీసుకున్నారా.. ఒకవేళ విడిపోతే హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా అగస్త్య పాండ్యా (హార్దిక్ పాండ్యా కుమారుడు) ను ఎందుకు ఎత్తుకుంటాడు? ఆ ఫోటోను చూసిన నటాషా ఎందుకు పాజిటివ్ కామెంట్ చేస్తుంది? ఈ ప్రశ్నలు కాస్త పక్కన పెడితే.. నటాషా తో విడాకులు తీసుకున్నాడనే రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో.. హార్దిక్ పాండ్యా చేసిన ఓ పని నెట్టింట చర్చకు దారితీస్తోంది.

హార్దిక్ పాండ్యా, తన సోదరుడు కృనాల్ పాండ్యా తో కలిసి ముంబైలోని లోయర్ పరేల్ అనే ప్రాంతంలో మూడు జోడి అపార్ట్మెంట్లను రెంట్ కు తీసుకున్నాడు. వీటికి ప్రతినెలా 7.75 లక్షల అద్దెను చెల్లిస్తున్నాడు.. ఈ వివరాలను ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్లాట్ ఫామ్ జాప్ కీ వెల్లడించింది.. నటాషా తో విడాకులు తీసుకున్నాడనే వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో తన ఆస్తులు తల్లి పేరు మీద ఉన్నాయని హార్దిక్ పాండ్యా అప్పట్లో అన్న ఒక వీడియో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తన ఆస్తుల్లో 70% నటాషాకు ఇచ్చినట్టు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా కిరాయి అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్నాడనే వార్త సంచలనంగా మారింది.

ముంబై ప్రాంతంలో హార్దిక్ పాండ్యా జోడి అపార్ట్మెంట్స్ ను అద్దెకి తీసుకున్నాడు. రెండు రెసిడెన్షియల్ యూనిట్స్ ను ఒక యూనిట్ గా చేయడానికి జోడి అపార్ట్మెంట్స్ అంటారు. హార్దిక్ పాండ్యా, తన సోదరుడు కృనాల్ పాండ్యాతో ఎన్ పార్ లోటస్ గ్రూపులోని లోటస్ ఎన్ పర్ రెసిడెన్సీలో రెంట్ కు తీసుకున్నాడు.. హార్దిక్ రెంట్ కు తీసుకున్న జోడి అపార్ట్మెంట్ 28 అంతస్తులో ఉంది. దీనికి సంబంధించి లీజు అగ్రిమెంట్ 2021 ఆగస్టులో జరిగింది. దీని అద్దె నెలకు 2.5 లక్షలు.. అగ్రిమెంట్ హార్దిక్ పాండ్యా తరఫున వైభవ్ హిమాంశు పాండ్యా, ల్యాండ్ లార్డ్ లిల్లీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరిగింది. డీ జోడి అపార్ట్మెంట్లో రెండు స్టాక్ కార్ పార్కింగ్ లు, అటాచ్డ్ టెర్రస్ గార్డెన్ లు ఉంటాయి. ఈ లీజు కాలపరిమితి 60 నెలలుగా ఉంది.. ఈ జోడి అపార్ట్మెంట్ రెంట్ మొదటి 36 నెలల్లో నెలకు 2.5 లక్షలు గా ఉంది. ఆ తర్వాత 24 నెలల్లో నెలకు 2.87 లక్షలు గా ఉంది. ఈ జోడి అపార్ట్మెంట్ కోసం హార్దిక్ పాండ్యా ముందస్తు డిపాజిట్ గా 7.5 లక్షలు చెల్లించాడు..

ఇక ఇదే అపార్ట్మెంట్లో 30వ అంతస్తులో ఉన్న మరో జోడి రెసిడెన్షియల్ ప్లాట్ అద్దె 2.5 లక్షలు. దీనికి సంబంధించి ఒప్పందంపై ఆ అపార్ట్మెంట్ యజమాని షీలా కమలేష్ మెహతా, కృణాల్ పాండ్యా తరఫున వైభవ్ హిమాన్ష్ పాండ్యా సంతకం చేశారు. ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి మొదటి 36 నెలల్లో నెలకు 2.5 లక్షలు, తదుపరి 24 నెలలకు 2.87 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ కాంప్లెక్స్ లో ఒప్పో ఫ్లాట్ క్యాపిటల్ వేల్యూ 6.5 నుంచి 8 కోట్ల వరకు ఉంటుందట. త్రిబుల్ బెడ్ రూమ్ అయితే తొమ్మిది నుంచి పది కోట్ల వరకు ఉంటుందట. ఇక లోయర్ పరేల్ గ్రూప్ ఆధ్వర్యంలోని కాంప్లెక్స్ లలో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ ధర నాలుగు కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఉంటాయట. హార్దిక్ పాండ్యా గతంలో ముంబైలోని ఖార్ వెస్ట్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నాడు. దీనికి నెలకు 3.15 లక్షల అద్దె చెల్లిస్తున్నాడు.. ఇది రుస్తోమ్జీ పారా మౌంట్ అనే భవనంలో 16వ అంతస్తులో ఉంది. అయితే హార్దిక్ పాండ్యా ఆ భవనంలో నివసించడం లేదు. ఇక హార్దిక్ పాండ్యాకు గుజరాత్ రాష్ట్రంలోని వడోదర ప్రాంతాల్లో ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పెంట్ హౌస్ ఉంది. దీనిని అనురాధ అగర్వాల్ అనే ఇంటీరియర్ డిజైనర్ నిర్మించారు.