AP Elections 2024: టిడిపి కూటమి కొంప ముంచిన మహిళలు

రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది మహిళలకు కొత్తగా ఓట్లు వచ్చాయి. వారంతా వైసీపీ వైపు మొగ్గుచూపి ఉంటారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన సంగతి తెలిసిందే.

Written By: Dharma, Updated On : June 1, 2024 9:30 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీలో మహిళలు టిడిపి కొంపముంచనున్నారా? గుంప గుత్తిగా వైసీపీకి ఓట్లు వేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పోలింగ్ ముగిసిన వెంటనే టిడిపి కూటమికి అనుకూల వాతావరణం కనిపించింది. కానీ పూర్తిస్థాయిలో లెక్కలు వేసిన తర్వాత డీలా కనిపిస్తోంది. మహిళా ఓటింగ్ పెరగడం, వృద్ధులు పెద్ద ఎత్తున ఓట్లు వేయడం వంటి కారణాలు చూస్తే వైసిపికి ధీమా పెరిగింది. టిడిపి కూటమిలో ఆందోళన కనిపిస్తోంది. అందుకే వైసిపి అధినేత గతం కంటే మెరుగైన సీట్లను దక్కించుకుంటామని ధీమా కనబరిచారు. వారితో పోల్చుకుంటే టిడిపి నేతల్లో ధీమా వ్యక్తం కావడం లేదు.

రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది మహిళలకు కొత్తగా ఓట్లు వచ్చాయి. వారంతా వైసీపీ వైపు మొగ్గుచూపి ఉంటారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన సంగతి తెలిసిందే. కేవలం మహిళల పేరుతోనే, వారు లబ్ధిదారులుగా చూపించి, వారి ఖాతాలోనే నగదు పెద్ద ఎత్తున జమ చేశారు. దీంతో వైసిపి పై ఒక రకమైన పాజిటివ్ వారిలో వ్యక్తం అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ సెంటర్ల వద్ద మహిళలు బారులు తీరారు. వృద్ధులు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో కచ్చితంగా వారంతా వైసీపీకి ఓటు వేసి ఉంటారని ఒక అంచనాలు బయటకు వచ్చాయి. వైసీపీలో ధీమాకు అదే కారణం. టిడిపి కూటమిలో భయానికి కూడా వారే కారణం కావడం విశేషం.

అయితే మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున బారులుదీరడం తమకు అనుకూలమని టిడిపి సైతం అంచనా వేయడం ప్రారంభించింది. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ప్రతినెలా నగదు సాయం, పింఛన్ మొత్తాన్ని నాలుగువేల రూపాయలకు పెంపు, జూలై నెలలో ఒకేసారి 7వేల రూపాయలు పింఛన్ మొత్తంలో అందుతుందని ప్రచారం తదితర కారణాలతో మహిళలు, వృద్ధులు టిడిపి కూటమికి ఓటు వేసి ఉంటారు అన్నది ఒక అంచనా. అయితే తాము ఇప్పటికే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేసి ఉన్నందున, గతంలో చంద్రబాబు హామీ ఇచ్చి విస్మరించినందున.. వైసీపీకే మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఉంటారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే నిన్నటి వరకు గెలుస్తామన్న టిడిపి ధీమా.. క్రమేపీ సడలుతోంది.