Hardik Pandya: ఆస్ట్రేలియా సీరీస్ కి హార్దిక్ ఔట్…ఆ ఇద్దరిలో కెప్టెన్ ఎవరంటే..?

గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఆయన ఆస్ట్రేలియా తో జరిగే టి20 సిరీస్ కు కూడా ఆయన అందుబాటులో ఉండే విధంగా కనిపించడం లేదు. ఇక దాంతో ఆస్ట్రేలియా తో ఆడే టి20 సిరీస్ కి సూర్య కుమార్ యాదవ్ గాని రుతురాజ్ గైక్వాడ్ ని కెప్టెన్ గా పెట్టి ఈ మ్యాచ్ ఆడించాలని బిసిసిఐ చూస్తున్నట్టు గా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : November 10, 2023 12:47 pm

Hardik Pandya

Follow us on

Hardik Pandya: వరల్డ్ కప్ తర్వాత ఇండియన్ టీం ఆస్ట్రేలియా తో ఐదు మ్యాచ్ లా టి20 సిరీస్ ను ఆడబోతుంది.ఇక అందులో భాగంగానే ఈ సీరీస్ కి సీనియర్ ప్లేయర్లకి రెస్ట్ ఇచ్చి జూనియర్స్ ని ఆడించే ప్రయత్నం లో బిసిసిఐ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగం గానే హార్దిక్ పాండ్యాని ఈ టీమ్ కి కెప్టెన్ గా పెట్టీ జూనియర్ ప్లేయర్లతో మ్యాచ్ లను ఆడిద్దామని ఇక దానికోసమే సర్వం సిద్ధం చేస్తున్న క్రమంలో వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్య కి చీలి మండ గాయంతో వరల్డ్ కప్ టూర్నికి దూరమైన విషయం మనకు తెలిసిందే ఇక ఈ టోర్ని నుంచి ఆయన రూల్డ్ అవుట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ అయిన అందుబాటులో ఉంటాడని అందరూ అనుకున్నారు.

కానీ ఆయన గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఆయన ఆస్ట్రేలియా తో జరిగే టి20 సిరీస్ కు కూడా ఆయన అందుబాటులో ఉండే విధంగా కనిపించడం లేదు. ఇక దాంతో ఆస్ట్రేలియా తో ఆడే టి20 సిరీస్ కి సూర్య కుమార్ యాదవ్ గాని రుతురాజ్ గైక్వాడ్ ని కెప్టెన్ గా పెట్టి ఈ మ్యాచ్ ఆడించాలని బిసిసిఐ చూస్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇప్పటికే చైనా లో నిర్వహించిన ఏషియన్ గేమ్స్ లో గైక్వాడ్ కెప్టెన్ గా చేసి అక్కడ ఇండియా కి గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు కాబట్టి ఆయన కూడా కెప్టెన్ గా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇక ఇంతకుముందు కొన్ని మ్యాచ్ ల్లో సూర్య కుమార్ యాదవ్ కూడా కెప్టెన్ గా చేశాడు…అయితే ప్రస్తుతం టీం ఫోకస్ మొత్తం వరల్డ్ కప్ మీదనే పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది గెలిస్తే ముచ్చట గా మూడోసారి ఇండియా కి వరల్డ్ కప్ అనేది వస్తుంది.ఇక ఈ వరల్డ్ కప్పును గెలిచి ఇండియన్ టీమ్ ఒక అరుదైన రికార్డును కూడా సాధించడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రతి ప్లేయర్ కూడా తమదైన రీతిలో సూపర్ పెర్ఫార్మన్స్ ని ఇస్తూ వరల్డ్ కప్ లో అవకాశం వచ్చిన ప్రతిసారి రెచ్చిపోతు ఆడుతున్నారు.ఇక ఈ క్రమం లోనే ప్రతి ఒక్కరు టీం కి చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు.ఇక ఈ రకంగా ఆడితే ఇండియన్ టీమ్ సెమీ ఫైనల్, ఫైనల్ లో గెలవడం పెద్ద కష్టం అయితే కాదు…

ఇక ఆస్ట్రేలియా తో సీరీస్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరిగే టి 20 సీరీస్ కి హర్ధిక్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది…అప్పటి వరకు అతను పూర్తి గా కోలుకొని ఇండియన్ టీమ్ లోకి వస్తాడు…