Gopichand: పెళ్లైన హీరోయిన్ తో గోపీచంద్ ఆ తప్పు.. అందుకే ఇప్పటికీ తల ఎత్తుకోలేకపోతున్నాడా? అసలేం జరిగిందంటే?

నెగిటివ్ కు మాత్రమే కాదు హీరోయిన్ లకు కూడా దూరంగా ఉంటాడు గోపీచంద్. షూట్ కి వచ్చారా? సీన్స్ కంప్లీట్ అయిపోయాక వెళ్లిపోయామా ఇదే ఆయన పని. అంతకు మించి ఇతరులతో రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడరు ఈ స్టార్ హీరో.

Written By: Suresh, Updated On : November 10, 2023 12:52 pm

Gopichand

Follow us on

Gopichand: సైలెంట్, తన పని తానే చేసుకుంటాడు, గొడవలకు వెళ్లడు, గొడవలు వచ్చిన సైలెంట్ గా ఉంటారు. ఎవరిని పల్లెత్తు మాట అనడు. ఎవరైనా అన్నా కూడా సరేలే అని వదిలేస్తాడు. ఇంతకీ ఎవరు ఇంత మంచి మనిషి అనుకుంటున్నారా? అయినా ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉంటారా అనుకుంటున్నారు కదా.. అయితే ఎప్పుడు నవ్వుతూ కనిపించే ఆ స్టార్ ఎవరో కాదు గోపీచంద్. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని కొందరు మోసం చేశారు కూడా. ఇక సినిమాల కోసం ఈయనను సంప్రదించినప్పుడు కథ ఒకలా చెప్పి షూటింగ్స్ మాత్రం మరో విధంగా తీసేవారట. అలా కొందరు దర్శకనిర్మాతలు ఈయన కెరీర్ ను నాశనం చేశారు కూడా.

నెగిటివ్ కు మాత్రమే కాదు హీరోయిన్ లకు కూడా దూరంగా ఉంటాడు గోపీచంద్. షూట్ కి వచ్చారా? సీన్స్ కంప్లీట్ అయిపోయాక వెళ్లిపోయామా ఇదే ఆయన పని. అంతకు మించి ఇతరులతో రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడరు ఈ స్టార్ హీరో. కానీ ఒక సినిమా వల్ల అందులో నటించిన ఓ హీరోయిన్ వల్ల ఈయన మంచి క్యారెక్టర్ కు నెగిటివ్ వచ్చి పడింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రాశి. మహేష్ బాబు కెరీర్ లో చెత్త కలెక్షన్లు సాధించిన సినిమా ఏదంటే నిజం అని చెబుతారు. ఇందులో గోపీచంద్ విలన్ రోల్ లో నటించారు.

ఓ పాత్రలో రాశి ఈయన పక్కన కలిసి నటించింది. అందులో వీరిద్దరు రొమాన్స్ చేస్తుంటారు. ఆ రొమాన్స్ మరీ దారుణంగా ఉంటాయి. అప్పటివరకు పద్దతిగా కనిపించిన రాశి ఇలాంటి రోల్ లో నటించడంతో జనాలు స్వీకరించలేక పోయారు. అంతేకాదు గోపీచంద్ నుంచి కూడా ఇలాంటి రొమాన్స్ ను తీసుకోలేకపోయారట ఆయన అభిమానులు. ఇలా రాశికి, గోపీచంద్ కు ఇద్దరికి కూడా నెగిటివ్ ను తెచ్చిపెట్టింది ఈ సినిమా. కానీ ఇద్దరికి కూడా కథ ఒకలా చెప్పి తెరకెక్కించే సమయంలో మరో విధంగా చేశారట. సెన్సార్ కట్ తర్వాత ఆ సీన్స్ ను వేరేలా చూపించడంతో అందరూ తిట్టిపోశారు. మొత్తం మీద రాశితో గోపీచంద్ చేసిన రొమాన్స్ వల్ల ఇద్దరి లైఫ్ లో సరిదిద్దుకోలేని నెగటివ్ వచ్చి పడింది.