India Vs South Africa Final: బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో శనివరం(జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్–2024 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది. ఐసీసీ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు 11 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ఈ మ్యాచ్‌లో ఐదు కీలక టర్నింగ్ పాయింట్లు భారత్‌ను విశ్వ విజేతగా నిలిపాయి. 176 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలోని టర్నింగ్ పాయింట్ల గురించి తెలుసుకుందాం.
ఫైనల్‌లో అత్యధిక స్కోరు..
భారత్–దక్షిణాప్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 176 భారీ స్కోర్ చేసింది. ఇప్పటి వరకు జరిగిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఇదే అత్యధిక స్కోరు. రిషబ్ పంత్(0), సూర్యకుమార్‌యాదవ్(3) పరుగులకే ఔట్ అవడంతో ఆదిలోనే టీమిండియా కష్టాల్లో పడింది. కానీ కింగ్ కోహ్లీ(76), అక్షర్ పటేల్(47), శివమ్ దూబే (27)తో కీలక పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
అద్భుతమైన బౌలింగ్..
176 పరుగులను కాపాడుకోవడంలో భారత కీలక బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్‌సింగ్, హార్దిక్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్ చేశారు. కీలక సమయాల్లో వికెట్ల పడగొట్టారు. తొలి ఓవర్‌లోనే జస్ప్రీత్ బుమ్రా సంచలనాత్మక డెలివరీతో రీజా హెండ్రిక్స్(4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత జట్టులో ఉత్సాహం నింపాడు. తర్వాత అర్షదీప్‌సింగ్ దక్షిణాఫ్రికా సారధి ఐడెన్ మార్‌క్రమ్(4) వికెట్ పడగొట్టి షాక్ ఇచ్చాడు. అప్పటికి ఆ జట్టు స్కోర్ 12 పరుగలే.
నిలకడగా ఆడిన డికాక్, స్టబ్స్..
5 ఓవర్లలోపే రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ చర్కదిద్దే పనిని వికెట్ కీపర్–బ్యాటర్ క్వింటన్ డి కాక్(39), ట్రిస్టన్ స్టబ్స్(31) తమ భుజాలపై వేసున్నారు. కీలక పరుగులు చేశారు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. 58 పరుగుల భాగస్వామ్యాన్ని రాబట్టారు..
భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసి అక్షర్..
నిలకడగా ఆడుతున్న క్వింటన్ డి కాక్(39), ట్రిస్టన్ స్టబ్స్(31) జోడిని భారత లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బ్రేక్ చేశాడు. స్టబ్స్(31) పరుగుల వద్ద ఔట్ చేశాడు. తర్వాత అర్షదీప్ డికాక్ వికెట్ పడగొట్టాడు.
ధాటిగా ఆడిన క్లాసెన్..
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ కీలక పరుగులు చేశాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అటాకింగ్ ఇన్నింగ్స్‌తో భారత బౌలర్లను భయపెట్టాడు. అద్భుతమైన ఆఫ్ సెంచరీ చేశాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన బంతితో 17వ ఓవర్‌లో క్లాసెన్(52)ను పెవిలియన్‌కు పంపించాడు. అప్పటి వరకు దక్షిణాఫ్రికా చేతిలో ఉన్న మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు. 18వ ఓవరల్‌లో బుమ్రా తన అద్భుతమైన స్పెల్ కొనసాగించాడు. పొదుపుగా బౌలింగ్ చేయడంతోపాటు వికెట్ పడగొట్టాడు. ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికాకు 16 పరుగులు అవసరం కాగా, సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్‌తో పాండ్యా డేవిడ్ మిల్లర్ (21) యొక్క భారీ వికెట్‌ను కైవసం చేసుకున్నాడు.
జస్ప్రీత్ బుమ్రా డిఫైనింగ్ స్పెల్
జస్ప్రీత్ బుమ్రా 17 ఏళ్ల తర్వాత భారత్‌కు రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో రోహిత్ శర్మ మరోసారి బుమ్రాపై నమ్మకాన్ని చూపించాడు. అతను 16వ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాత 18వ ఓవర్‌లో జాన్‌సెన్ వికెట్‌ను తీయడంతోపాటు మెన్‌ఇన్ బ్లూ కోసం థింగ్స్ లాగడంతోపాటు రెండు పరుగులు మాత్రమే ఇవ్వడంతో విజయం భారత్‌వైపు వచ్చింది. బుమ్రా 4–0–18–2తో భారత్‌కు గౌరవనీయమైన టైటిల్‌ను అందించాడు.
సూర్యకుమార్ అద్భుత క్యాచ్
ఇక సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో చివరి ఓవర్‌లో ఉత్కంఠభరితమైన క్యాచ్‌ను తీసుకున్నాడు, టీమిండియా ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. చివరి ఆరు బంతుల్లో దక్షిణాఫ్రికాకు 16 పరుగులు అవసరం కావడంతో, లాంగ్ ఆఫ్‌లో భారీ హిట్‌ని మిస్‌క్యూ చేసిన తర్వాత ప్రమాదకరమైన డేవిడ్ మిల్లర్ పాండ్యా బౌలింగ్‌లో సిక్స్ కోసం ప్రయత్నించగా బౌండరీ వద్ద ఉన్న సూర్యకుమార్ పరిగెత్తుతూ క్యాచ్ పట్టాడు.
అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ షో..
దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితమైన విజయంలో భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారిలో అక్షర్ పటేల్ ఒకడు. 34/3తో కొట్టుమిట్టాడుతున్న భారత జట్టును తిరిగి ఆటలోకి తీసుకురావడానికి కోహ్లీతో ముఖ్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లీతో కలిసి అక్షర్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 47 పరుగుల వద్ద దురదృష్టవశాత్తు రన్‌ఔట్ అయ్యాడు.
విరాట్ కోహ్లీ విన్నింగ్ ఇన్నింగ్స్..
బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో భారత్ భారీ స్కోర్ చేయడంలో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 34 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. 176 పరుగుల్లో 74 పరుగులు కోహ్లీ చేసినవే.