Hardik Pandya: ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ , గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక సన్ రైజర్స్ ప్లేయర్లు బీభత్సమైన ఫామ్ లో ఉండి ముంబై బౌలర్లను చితకొట్టి 277పరుగులు చేశారు. ఇక ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ టీం చేయలేని ఒక సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఇక ఇదిలా ఉంటే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య తన వ్యవహార శైలిని మార్చుకోకుండా మొదటి మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్ లో కూడా కెప్టెన్సీ చేస్తూ విఫలం అయ్యాడు.
ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో ప్రత్యర్థులకు 200 ప్లస్ పరుగులను సమర్పించారు. పాండ్య కెప్టెన్ గా బౌలర్లను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక సతమతమయ్యాడు. ఇక ఇదే విషయం మీద ఆస్ట్రేలియన్ మాజీ ప్లేయర్ అయిన ‘టామ్ మూడి’ చాలా ఘాటు స్పందించాడు. ‘హార్దిక్ పాండ్య ఎందుకు బుమ్రా సేవలను వినియోగించు కోలేకపోతున్నాడు అసలు పాండ్య కి కెప్టెన్సీ చేయడం చేత కాదా’ అంటూ ట్విట్టర్ లో రాసుకచ్చాడు…అలాగే యూసఫ్ పఠాన్ కూడా హార్దిక్ కెప్టెన్సీ ఒక చెత్త కెప్టెన్సీ అంటూ తన తను కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
ఇక ఇది ఇలా ఉంటే ముంబై యాజమాన్యం పాండ్యాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ కెప్టెన్ గా ఘోరంగా విఫలమై జట్టుకు రెండు పరాజయాలను చవి చూడల్సి వచ్చింది. ఇక ముంబై జట్టు తమ శైలిని మార్చుకోకుండా ఇలాగే ఆడితే ఈ ఐపీఎల్ లో కనీసం ప్లే ఆప్ కి కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. పాండ్యా ప్రవర్తన చూసి ఆ జట్టులోని మిగతా ప్లేయర్లు పాండ్యా కెప్టెన్సీలో ఆడడానికి సుముఖంగా కనిపించడం లేదు. ముంబై యాజమాన్యం ఇప్పటికైనా హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించి మళ్లీ తిరిగి రోహిత్ శర్మ కి కెప్టెన్సీ అప్పగిస్తే ముంబై టీం తిరిగి గాడిలో పడుతుంది అని ముంబై అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ప్లేయర్లు సన్ రైజర్స్ నిర్దేశించిన 277 పరుగుల భారీ స్కోరును చేదించడంలో చివరి దాకా పోరాడారు. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, కిషన్ మంచి శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ 34 బంతుల్లో 64 పరుగులు 6 సిక్స్ లు, రెండు బౌండరీలతో మ్యాచ్ కు రసవత్తరంగా మార్చారు.
టిమ్ డేవిడ్ 22 బంతుల్లో 42 పరుగులతో మెరుపులు మెరూపించిన కూడా ఫలితం లేకుండా పోయింది.ఇక వీళ్లంతా బాగా ఆడినప్పటికి పాండ్య మాత్రం 20 బంతుల్లో 24 పరుగులు చేయడం కూడా ఈ టీమ్ పరాజయానికి ఒక కారణమనే చెప్పాలి… ఇక ముంబై ఇండియన్స్ టీం ఇప్పటికైనా తమ పొరపాట్లను తెలుసుకొని హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ కు అప్పగిస్తే ఆ టీం గాడిలో పడుతుందని చాలా మంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు.