Arun Kumar Nalimela: న్యూయార్క్ టైంస్వేర్.. ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన అమెరికాలోని మిడ్ టౌప్ హాన్‌హాటన్‌లోని ఒక ప్రధాన వాణిజ్య కూడలి. పర్యాటక కేంద్రం. వినోద కేంద్రం. ఇది బ్రాండ్‌వే, సెవెంత్ అవెనూ 42వ వీధి జంక్షన్ ద్వారా ఏర్పడింఇ. పక్కనే ఢఫీ స్వేర్‌తో కలిపి టైమ్స్ స్వేర్ 42వ, 47వ వీళుల మధ్య ఐదు బ్లాకుల పొడవుగ బౌటీ ఆకారపు ప్లాజా. దీనిపై అనేక డిజిటల్ బిల్ బోర్డులు ప్రకటనలు అందించే వ్యాపారాల ద్వారా ప్రకాశంతంగా వెలిగిపోతుంది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే పాదచారుల ప్రాంతాల్లో ఒకటి. ప్రపంచంలోని అత్యధికంగా సందర్శించే పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఏటా ఇక్కడికి 50 మిలియన్ల మంది వస్తుంటారు. నిత్యం 3,30,000 వేల మంది ఇక్కడి నుంచి వెళ్తారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై తెలుగోడి చిత్రం మెరిసింది.
భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్‌కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. ఆయన తీసిన ఫొటో అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్వేర్ బిల్ బోర్డుపై ప్రదర్శించారు. ఎన్‌ఎఫ్‌ఎన్‌వైసీ అనే సంస్థ ఇటీవల ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో 5 వేల ఫొటోలు పోటీపడ్డాయి. అరుణ్‌కుమార్ తీసిన ఫొటోను ఎంపిక చేసి టైం స్క్వేర్ బిల్‌బోర్డుపై మంగళవారం రాత్రి నుంచి ప్రదర్శితమవుతున్నట్లు తెలిపారు.
నాలుగు రోజులు..
ఈ ఫొటోను నాలుగు రోజులపాటు ప్రదర్శిస్తారు. తన కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని అరుణ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో లలిత కళా అకాడమీ నిర్వహించిన మేళా మూమెంట్ పొటోగ్రఫీ పోటీల్లోనూ ఆయన ఇటీవల బహుమతి అందుకున్నాడు. గత డిసెంబర్‌లో ప్రధాని మోదీ అరుణ్‌కుమార్ తీసిన ఫొటోల గురించి మన్‌కీబాత్‌లో ప్రస్తావించారు.
ప్రముఖుల ఫొటోల ప్రదర్శన..
న్యూయాఆర్క్ టైమ్స్ స్వేర్‌బోర్డుపై ఫొటో ప్రదర్శించడం చాలా ఖరీదు. ఇక్కడ గతంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా ఆయన చిత్రం ప్రదర్శించారు. తర్వాత మహేశ్‌బాబు తనయ సితార చిత్రాన్ని కూడా ఓ జ్వువెల్లరీ సంస్థ ఏర్పాటు చేసింది. పర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫొటోను కూడా డిస్‌ప్లే చేశారు. అయోధ్య రామ మందిరం ఫొటోను కూడా ప్రదర్శించారు. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫొటోనూ ప్రదర్శించారు.