Hardik Pandya : ఆ సింగర్ తో హార్దిక్ పాండ్యా డేటింగ్..నెటిజన్లు పసిగట్టడంతో అసలు విషయం లీక్..

జాస్మిన్ వాలియా.. పేరుపొందిన బ్రిటిష్ సింగర్. ఆమె గ్రీసులో విహారయాత్ర చేస్తోంది. నీలిరంగు ఈత దుస్తులు ధరించి, ఈత కొలను పక్కన ఆమె ఫోటోలు దిగింది. తలకు టోపీ ధరించి, చలువ కళ్లద్దాలతో ఆకట్టుకుంది. అయితే హార్దిక్ కూడా సేమ్ అదే లొకేషన్లో ఫోటోలు దిగాడు. క్రీం కలర్ ప్యాంట్ వేసుకొని, నలుపు తెలుపు రంగుల మిశ్రమంతో కూడి ఉన్న చొక్కాను ధరించి ఉన్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : ఆగస్ట్ 14, 2024 11:07 ఉద.

Hardik Pandya Dating Jasmine Walia

Follow us on

Hardik Pandya: నటాషా తో విడాకులు తీసుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.. ఆ మధ్య టీ – 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యాను ఓ మహిళా అభిమాని కలిసింది. ఆమె అతడితో కలిసి ఫొటోలు దిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే హార్దిక్ ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ ఊహగానాలని తర్వాత తేలింది. అనంతరం హార్దిక్ – నటాషా తమ విడాకుల వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇద్దరూ ఇన్ స్టా గ్రామ్ లో సంయుక్తంగా ప్రకటన చేశారు. ఆ తర్వాత నటాషా తన కుమారుడు అగస్త్యను తీసుకొని స్వదేశానికి వెళ్లిపోయింది. దీంతో కొద్దిరోజులు హార్దిక్ ఒంటరిగా ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో అతడు ఆడలేదు. అతడి అభ్యర్థన మేరకు బీసీసీఐ మినహాయింపు ఇచ్చింది. అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గ్రీస్ లో ఉన్నాడు. ఇది పెద్ద వార్త కాకపోయినప్పటికీ.. అతడు ఒంటరిగా మాత్రం అక్కడ లేడు. ఇదే విషయాన్ని నెటిజన్లు కనిపెట్టడంతో ఒక్కసారిగా హార్దిక్ వార్తల్లో వ్యక్తి అయ్యాడు.

బ్రిటిష్ సింగర్..

జాస్మిన్ వాలియా.. పేరుపొందిన బ్రిటిష్ సింగర్. ఆమె గ్రీసులో విహారయాత్ర చేస్తోంది. నీలిరంగు ఈత దుస్తులు ధరించి, ఈత కొలను పక్కన ఆమె ఫోటోలు దిగింది. తలకు టోపీ ధరించి, చలువ కళ్లద్దాలతో ఆకట్టుకుంది. అయితే హార్దిక్ కూడా సేమ్ అదే లొకేషన్లో ఫోటోలు దిగాడు. క్రీం కలర్ ప్యాంట్ వేసుకొని, నలుపు తెలుపు రంగుల మిశ్రమంతో కూడి ఉన్న చొక్కాను ధరించి ఉన్నాడు. దీంతో వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. నటాషా తో విడిపోయిన తర్వాత హార్దిక్ జాస్మిన్ వాలియా తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. తన భార్యకు విడాకులు ఇచ్చిన నెల తర్వాత హార్దిక్, జాస్మిన్ తో కలిసి గ్రీస్ లో విహారయాత్ర చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..

“ఇద్దరు ఒకే ఫూల్ దగ్గర ఉన్నట్టు మాకు అనిపిస్తోంది. సేమ్ అదే లొకేషన్లో జాస్మిన్, హార్దిక్ ఫోటోలు దిగినట్టు తెలుస్తోంది. వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో ఆ లోకేషన్ మాకు కనిపించింది. అందుకే వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని అనిపిస్తోంది. మొత్తానికి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత హార్దిక్ తన ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు విహారయాత్రలో ఉన్నాడు. ఆ యాత్రలో తనకు తగిన జోడితో కనిపిస్తున్నాడని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

నెటిజన్ల వ్యాఖ్యలకు తగ్గట్టుగా హార్దిక్ పాండ్యా ఆ స్విమ్మింగ్ పూల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలో.. దానిని జాస్మిన్ లైక్ చేసింది. దీంతో నెటిజన్ల ఆరోపణలకు బలం చేకూరింది. అయితే హార్దిక్ జాస్మిన్ పెట్టిన ఫోటోకు స్పందించలేదు. అయితే ఇటీవలి ఆమె ఫోటోలను వరుసగా హార్దిక్ లైక్ చేశాడు. మరోవైపు వారిద్దరు ఇన్ స్టా లో పరస్పరం ఫాలో అవుతున్నారు. ” హార్దిక్ – జాస్మిన్ కలిసి ఉన్నారు. ఇది కొత్త ప్రేమ” ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు..” మీరు కనిపిస్తున్నారు సరే.. ఇందులో హార్దిక్ ఎక్కడా అని” మరో నెటిజన్ కామెంట్ చేశాడు..”మీరు హార్థిక్ పాండ్యా తో డేటింగ్ లో ఉన్నారా” అని ఇంకో వ్యక్తి జాస్మిన్ ను ప్రశ్నించాడు. ప్రస్తుతం హార్దిక్, జాస్మిన్ విహారానికి సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది.