https://oktelugu.com/

Stree 2: ‘స్ట్రీ 2 ‘ మూవీ మొదటి రోజు పెను ప్రభంజనాన్ని సృష్టించబోతుందా..?

ప్రస్తుతం ఇండస్ట్రీ లో లెక్కలు మొత్తం మారిపోయాయి...మొదటి రోజు కలెక్ట్ చేసిన వసూళ్లను బట్టి ఆ సినిమా రేంజ్ ఏంటో లెక్కగట్టేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 14, 2024 / 11:06 AM IST

    Stree 2

    Follow us on

    Stree 2: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ ఎలాగైనా సరే సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ కూడా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమాల మీద ప్రేక్షకుల్లో మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఆగస్టు 15వ తేదీన ‘స్ట్రీ 2 ‘ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లను కలెక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటి రోజు 25 కోట్ల వరకు కలెక్షన్ వసూలు చేస్తుందని ముందుగా అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఆ అంచనా దాటి ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 50 కోట్ల వరకు ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు రాబట్టబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక జవాన్, పఠాన్, యానిమల్ లాంటి కొన్ని పెద్ద సినిమాలకు మాత్రమే ఇక్కడ మొదటి రోజు 50 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టాయి. మరి ఇప్పుడు శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు లాంటి మీడియం రేంజ్ నటినటులు నటించిన ఈ సినిమా 50 కోట్ల మార్కును కనక దాటినట్లయితే స్టార్ హీరోలతో సైతం పోటీపడి భారీ వసూళ్లను సాధించిన సినిమాగా మంచి రికార్డులను క్రియేట్ చేస్తుంది…ఇక మొత్తానికైతే మొదటి రోజు వచ్చే కలెక్షన్ల మీదనే ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షించబడుతుంది.

    ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హీరోగా హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్ 2 సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా మొదటి రోజు 200 కోట్ల వరకు కలెక్షన్లను రాబడుతుందనే అంచనాలో అందరూ ఉన్నారు. ఇటు ఎన్టీఆర్ ని, అటు హృతిక్ రోషన్ పెట్టి ఈ సినిమాని చేయడం అనేది నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పాలి.

    దాని ద్వారా సౌత్, నార్త్ రెండు ఏరియాల్లో కూడా ఈ సినిమాకి భారీ మార్కెట్ అయితే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమా మొదటి రోజు 200 కోట్లకు పైన వసూళ్లను రాబడుతోంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంటూ ట్రేడ్ పండితులు సైతం వల్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    ఇక మొదటి రోజే ఈ సినిమా ఈ రికార్డును కనక సాధించినట్లయితే ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది… ఇక ప్రస్తుతం మొదటి రోజు రికార్డుల ట్రెండ్ అనేది నడుస్తుంది. దాని వల్లే మొదటి రోజు ఎవరి సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అందరిలో చాలా ఆసక్తి ని రేకెత్తిస్తుంది…