Hardik Pandya: ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా ప్రతి టీం కూడా తమదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రతి మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటి క్రమం లోనే ముంబై ఇండియన్స్ టీం పరిస్థితి మాత్రం మరి దారుణంగా తయారైంది. ఒకప్పుడు చాంపియన్స్ గా గుర్తింపు పొందిన ఈ టీమ్ తో మ్యాచ్ ఆడలంటే మిగతా జట్లు భయపడేవి. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అసలు ముంబై ఇండియన్స్ ఏమాత్రం తన మ్యాజిక్ ను అయితే రిపీట్ చేయలేకపోతుంది.
దానికి కారణం ఏంటి అంటే కెప్టెన్సీలో మార్పు చేయడమే అని కొంతమంది భావిస్తుంటే, కొత్త కెప్టెన్ గా నియామకమైన హార్దిక్ పాండ్యాకి టీం మెంబర్స్ నుంచి సరైన ప్రోత్సాహం లభించడం లేదని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ముఖ్యంగా మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా కి కెప్టెన్సీకి సంబంధించిన ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ గెలవడానికి కారణం ఏంటి అనే విధంగా హార్థిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం మాట్లాడిన మాటలను వింటే మనకు అర్థమవుతుంది. ఆయన ఏమన్నాడు అంటే చెన్నై సూపర్ కింగ్స్ టీం కి ఋతురాజు గైక్వాడ్ కెప్టెన్ అయినప్పటికీ ధోని మాత్రం వికెట్ల వెనకాల నుంచి ఎప్పుడు సలహాలు, సజెషన్స్ ఇస్తూ వచ్చాడు.
అందువల్లే వాళ్ళు గెలిచారని చెప్పాడు. అంటే ఇన్ డైరెక్ట్ గా నాకు రోహిత్ శర్మ గాని టీమ్ మెంబర్స్ గాని ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదు అనే అర్థం వచ్చే విధంగా తను మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. ఇక హార్దిక్ పాండ్యా చెన్నై గెలుపు ధోని వల్ల సాధ్యమైంది కానీ గైక్వాడ్ వల్ల కాదు అనే విధంగా మాట్లాడాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అయిన “ఆడం గిల్ క్రిస్ట్ ” కూడా హార్దిక్ పాండ్యా కి ముంబై ఇండియన్స్ టీమ్ లో ఉన్న ఏ ప్లేయర్లు కూడా సపోర్ట్ చేయడం లేదని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇక ఇదిలా ఉంటే హార్ధిక్ పాండ్య, ఋతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ ఒకేసారి కెప్టెన్లుగా మారినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మాత్రం సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ముంబై ఇండియన్స్ మాత్రం పడుతూ లేస్తూ ముందుకెళ్తుంది.
దానికి కారణం ఏంటి అంటే ముంబై ఇండియన్స్ టీం లో అప్పటివరకు సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మని పక్కన పెట్టి హర్ధిక్ పాండ్యా ని టీం లోకి తీసుకొని కెప్టెన్ చేయడం టీం లో ఉన్న సీనియర్ ప్లేయర్లేవరికి నచ్చలేదు. ఎందుకంటే సూర్య కుమార్ యాదవ్, బుమ్రా ఇద్దరిలో ఎవరో ఒకరు రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ గా ఆ టీమ్ బాధ్యతలను దక్కించుకోవాలను కున్నారు. కానీ మధ్యలో పాండ్య రావడం వాళ్ళకి నచ్చలేదు. ఇక ఇది ఇలా ఉంటే అభిమానులకు కూడా ఈ సీజన్ లో రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేయడం నచ్చలేదు. ఇక దానివల్లే ఆ టీమ్ లో తీవ్రమైన వ్యతిరేకతలు ఏర్పడుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ టీం నిర్ణయాలు మొత్తం ధోనినే తీసుకుంటాడు. కాబట్టి తన తర్వాత తన టీమ్ లో కెప్టెన్ ఎవరిని చేయాలనే దానిమీద రెండు మూడు సంవత్సరాలు నుంచే కసరత్తులు చేస్తూ వస్తున్నాడు. ఇక మొదట రవీంద్ర జడేజాకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పటికీ, ఆయన ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఇక దాంతో గైక్వాడ్ మీద ఫోకస్ పెట్టి ఆయనను రెండు సంవత్సరాలు అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత ఈ సంవత్సరం అతనికి అఫీషియల్ గా కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. ఇక ఇప్పటికి కూడా ధోని సలహాలు, సూచనలు ఇస్తూ తన సారథ్యంలోనే అతన్ని ముందుకు నడుపుతున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ టీమ్ పరిస్థితి అలా కాదు. వాళ్ళకి కెప్టెన్ గా ఎవరు ఉండాలి అనేది టీం యాజమాన్యం నిర్ణయిస్తుంది. కాబట్టే వాళ్ళకి ఇన్ని సమస్యలు వచ్చిపడుతున్నాయి..ఇక మిగిలిన మ్యాచుల్లో అయిన వాళ్ల సత్తా చాటుతారో లేదో చూడాలి…