Thangalaan: తంగలాన్ గ్లిమ్స్ చూస్తే విక్రమ్ పడిన కష్టం ఏంటో తెలుస్తుంది…ఆయన డెడికేషన్ నెక్స్ట్ లెవల్ అంతే….

ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయితే చాలా ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Written By: Gopi, Updated On : April 18, 2024 9:56 am

Thangalaan

Follow us on

Thangalaan: ప్రస్తుతం తమిళ్, తెలుగు అనే తేడాలు లేకుండా సినిమా మొత్తం ఒకటే అయిపోయింది. ఇక ఇప్పుడు మనది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి భాషలో రిలీజ్ అయిన సినిమా కూడా పాన్ ఇండియా రెంజ్ లో రిలీజ్ అవుతుంది.ప్రతి ఒక్క ఆడియన్ ఆ సినిమాలు చూస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనే మాట్లాడుకుంటే మంచిది.

ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయితే చాలా ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలో వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతుంది. అందువల్లే ఒక సినిమా చేయడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తున్నారు. ఇక అందులో భాగంగా “చియాన్ విక్రమ్” గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ వస్తున్నాడు.

ఒక క్యారెక్టర్ కోసం ఆయన పడే కష్టం ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో కూడా పడలేడేమో అనిపిస్తుంది. ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పుడు ‘తంగలాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక అగోరా గెటప్ లో తను కనిపిస్తున్నాడు. దానికోసం ఆయన చాలా రకాలుగా కష్టపడ్డాడని సినిమా యూనిట్ ప్రెస్ మీట్ లో తెలియజేశారు. ఇక ఇది ఇలా ఉంటే చియన్ విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ అయితే వదిలారు. ఇక ఆ గ్లిమ్స్ లో ఆ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు.

ఇక మేకింగ్ వీడియో లో విక్రమ్ పడిన కష్టం కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అంతటి కష్టాన్ని భరిస్తూ కూడా ఆయన ఆ సినిమా చేశాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. నిజానికి ఆయనకు మేకప్ వేసుకోడానికి దాదాపు ఒక 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఆ గెటప్ లో కూడా అలాంటి ఇబ్బందుల్లో కూడా ఆయన ది బెస్ట్ ఇవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాడు. అంటే విక్రమ్ డెడికేషన్ కి మనమందరం మెచ్చుకోవాల్సిందే…ఇక ఈ సినిమాతో ఆయన కచ్చితం గా ఒక భారీ సక్సెస్ అయితే కొట్టబోతున్నాడు అనేది అర్థం అవుతుంది…