Nagababu
Deputy CM Pawan Kalyan : ఎంత జాగ్రత్తగా అడుగులు వేసినా రాజకీయ పరంగా విమర్శలు ఎలాంటి నాయకుడికైనా తప్పవు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అలాంటి పరిస్థితినే ఎదురుకుంటున్నాడు. 15 ఏళ్ళ పాటు చంద్రబాబే సీఎం(CM Chandrababu Naidu) గా ఉండాలంటూ ఆయన ఇరు పార్టీల క్యాడర్ ని సంతృప్తి పరిచే మాటలు మాట్లాడుతుండగా, ఆయన అనుచరులు మాత్రం నోటి దూలతో పవన్ కళ్యాణ్ లేని పోనీ తలనొప్పి తెచ్చి పెడుతున్నారు. అందుకు బెస్ట్ ఉదాహరణ ఆయన సోదరుడు నాగబాబు(Nagababu Konidela) గారే. నాగబాబు కి అసలు ఫిల్టర్ ఉండదు. మనసులో ఏదుంటే అది మాట్లడేస్తుంటాడు. గతంలో ఆయన తన అన్నయ్య చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి గొప్పగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై, ఆయన అభిమానులపై నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. మెగా అభిమానుల మధ్య పెద్ద అంతర్గత పోరుకి దారి తీశాయి ఆ వ్యాఖ్యలు. ఇప్పుడు నాగ బాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఐక్యత ని దెబ్బ తీసింది.
Also Read : తమిళనాడులోకి జనసేన ఎంట్రీ.. పవన్ సంచలనం!
జనసేన పార్టీ ఆవిర్భావం రోజున టీడీపీ పార్టీ అభిమానులు ఎంతో సంతోషంతో పవన్ కళ్యాణ్ కి జనసైనికులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేసారు. సాయంత్రం వరకు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నింది. ఎప్పుడైనా ఆవిర్భావ సభ మొదలైందో అప్పటి నుండి ప్రారంభం అయ్యింది టీడీపీ, జనసేన అభిమానుల మధ్య గొడవలు. నాగబాబు వర్మ ని ఉద్దేశిస్తూ ‘పిఠాపురం లో పవన్ కళ్యాణ్ అంతటి ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణాలు ఒకటి పవన్ కళ్యాణ్ చరిష్మా అయితే, రెండు పిఠాపురం ఓటర్లు. ఈ రెండే ఆయన గెలుపుకు కారణం. అలా కాకుండా నేనే ఆయన గెలుపుకి కారణం అనుకుంటే మీ కర్మ’ అంటూ వ్యాఖ్యానించాడు. ఆరోజు నుండి నేటి వరకు సోషల్ మీడియా లో టీడీపీ, జనసేన పార్టీల అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ కి గొడవలు చేరుకున్నాయి.
ఇప్పటికే ప్రతీరోజు ఈ ఇరువురి పార్టీల అభిమానులు పరస్పరం విమర్శించుకుంటూనే ఉన్నారు. టీడీపీ పార్టీ అభిమానులు ఒక అడుగు ముందుకేసి వైసీపీ పార్టీ అభిమానులతో చేతులు కలిపి సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడుతున్నారు. ఇదంతా నాగబాబు రగిలించిన చిచ్చు కారణంగానే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. MLC స్థానాన్ని దక్కించుకొని శాసనమండలి లోకి ఇంకా అడుగుపెట్టకముందే ఈ రేంజ్ నోరు జారడంటే, ఇక శాసన మండలి లోకి అడుగుపెట్టిన తర్వాత ఏ రేంజ్ లో నోరు జారుతాడో అని అభిమానులు కంగారు పడుతున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ని కూడా అభిమానులు సెన్సెటివ్ అంశాల గురించి మాట్లాడడం మానేస్తే బెటర్, రోజురోజుకి ట్రోలింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, భరించలేకపోతున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా కూడా ఇప్పుడు వైసీపీ పార్టీ కంటే ఎక్కువగా జనసేన పార్టీ ని టార్గెట్ చేస్తుండడం గమనార్హం.
Also Read : అయ్యా చంద్రబాబు గారు.. ఇంకెప్పుడయ్యా?