Gujarat Team : సోమవారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 39 పరుగులతో తేడాతో ఓటమిని కొని తెచ్చుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ 198 స్కోర్ చేసింది..గిల్ 90, సాయి సుదర్శన్ 52 పరుగులతో వీర విహారం చేశారు. బట్లర్ 41* పరుగులతో అదరగొట్టాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లు వైభవ్ అరోరా, హర్షిత్ రానా, రస్సెల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత కోల్ కతా చేజింగ్ మొదలుపెట్టింది. 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ రహానే 50 అర్హులతో ఆకట్టుకున్నాడు. వెంకటేష్ అయ్యర్ (14), రమణ్ దీప్ సింగ్(1), రింకూ సింగ్(17), అండ్రీ రస్సెల్(21) ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. వీరి వైఫల్యం కోల్ కతా జట్టు కొంపమొచ్చింది. మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్ తల ఒక వికెట్ పడగొట్టారు. రషీద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ చేరి రెండు వికెట్లు దక్కించుకున్నారు.
Also Read : ఏమన్నా మ్యాచా? గుజరాత్ ఓటమికి.. రాజస్థాన్ గెలుపునకు మధ్య ఆ ఇద్దరు..!
ఐదవ ఓటమి
గుజరాత్ జట్టు చేతిలో ఓడిపోవడం ద్వారా ఈ సీజన్లో..కోల్ కతా ఐదవ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. కోల్ కతా ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడింది. మూడంటే మూడే విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో కొనసాగుతోంది..నెట్ రన్ రేట్ 0.212 కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ..కోల్ కతా ఇంకా ఆరు మ్యాచ్లు ఆడాలి. ఈ ఆరు మ్యాచ్లో కోల్ కతా భారీపరుగుల తేడాతో గెలవాలి. ఒక్క మ్యాచ్లో ఓడిపోయినా ప్లే ఆఫ్ అవకాశాలు కష్టమవుతాయి. అప్పుడు ఇతర జట్ల నెట్ రన్ రేట్ మీద కోల్ కతా ఆధార పడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరు మ్యాచ్లకు గాను మూడు మ్యాచ్లు ఓడిపోతే కోల్ కతా అధికారికంగానే ప్రస్తుత ఐపిఎల్ సీజన్ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. కోల్ కతా ఏప్రిల్ 26న పంజాబ్, ఏప్రిల్ 29న ఢిల్లీ, మే 4న రాజస్థాన్, మే 7న చెన్నై, మే 10న హైదరాబాద్, మే 17న బెంగళూరు జట్లతో ఆడుతుంది. అయితే బౌలింగ్ వైఫల్యం ఆ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. బ్యాటింగ్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. వరుణ్ చక్రవర్తి, రస్సెల్ విఫలం కావడం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వీరిద్దరూ దుమ్ము రేపితేనే కోల్ కతా కు గెలిచే అవకాశాలుంటాయి.
Also Read : ఐపీఎల్ ఫైనల్ లో ఓటమి: గుజరాత్ టైటాన్స్ నెట్ వర్త్ ఎంతకు పెరిగిందో తెలుసా?