https://oktelugu.com/

Gujarat Titans IPL 2023: ఐపీఎల్ ఫైనల్ లో ఓటమి: గుజరాత్ టైటాన్స్ నెట్ వర్త్ ఎంతకు పెరిగిందో తెలుసా?

సాధారణంగా ఏదైనా ఒక మ్యాచ్లో విజయం సాధించి ట్రోఫీ గెలుచుకున్న జట్టు గురించి అందరూ మాట్లాడుతుంటారు. విజయం ఇచ్చే కిక్ అలాంటిది మరి.. కానీ కొన్ని కొన్ని సార్లు పరాజయం పొందిన జట్టు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది.

Written By:
  • Rocky
  • , Updated On : May 30, 2023 4:46 pm
    Gujarat Titans IPL 2023

    Gujarat Titans IPL 2023

    Follow us on

    Gujarat Titans IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా ముగిసింది. ధోని సారధ్యంలోని చెన్నై జట్టు విజేతగా ఆవిర్భవించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ జట్టును వారి సొంత మైదానంలో ఓడించింది. ముంబై ఇండియన్స్ తర్వాత అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న జట్టుగా రెండవ స్థానంలో నిలిచింది. ఇక విజయం సాధించిన తర్వాత చెన్నై జట్టుపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ధోని నాయకత్వానికి జేజేలు పలుకుతున్నాయి. విజయం సాధించిన తర్వాత ఇదంతా సర్వసాధారణమే. అయితే ఈ ఓటమితో గుజరాత్ జట్టు ఒక ఘనత సాధించింది.

    అంతకు పెరిగింది

    సాధారణంగా ఏదైనా ఒక మ్యాచ్లో విజయం సాధించి ట్రోఫీ గెలుచుకున్న జట్టు గురించి అందరూ మాట్లాడుతుంటారు. విజయం ఇచ్చే కిక్ అలాంటిది మరి.. కానీ కొన్ని కొన్ని సార్లు పరాజయం పొందిన జట్టు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గుజరాత్ జట్టు గురించి కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది.. ఎందుకంటే ఐపీఎల్ 2022లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓనర్ ఇప్పుడు అమితమైన లాభాలు ఆర్జించారు. ఐపీఎల్ 2022 లో లక్నో, అహ్మదాబాద్ టీంలు ఎంట్రీ చాయ్. 25 అక్టోబర్ 2021లో ఏర్పాటైన అహ్మదాబాద్ ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ ( జీ టీ) ని యూరప్ కు చెందిన ఫ్రెంచ్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్స్ 5,625 కోట్లకు కొనుగోలు చేసింది. దీన్ని చైర్మన్ పేరు స్టీవ్ కోల్ట్స్. ఈ కంపెనీ క్రీడలతో పాటు పెట్టుబడి బ్యాంకింగ్, బ్రోకరేజీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

    ఇక ఈ సీవీసీ కాపిటల్ పెద్ద అమెరికన్ ఫ్రెంచ్ ఈక్విటీ సంస్థ. 133 బిలియన్ యూరోల విలువైన ఆస్తులు ఈ సంస్థకు ఉన్నాయి. దాని ప్రకారం భారత దేశ కరెన్సీ తో పోల్చితే దాదాపు 12 లక్షల కోట్ల వరకు ఈ సంస్థ ఆస్తులు ఉంటాయి. ఇది ఐపీఎల్ క్రికెట్ లీగ్ లోనే మెజారిటీ జట్టు యజమానుల ఎన్నికల విలువ కంటే చాలా ఎక్కువ. ఈ సంస్థ ఐపీఎల్ బిడ్ గెలిచిన తర్వాత, ముంబై ఇండియన్స్ మాజీ స్టార్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ఎంచుకుంది. అలాగే స్టార్ ఆటగాడు గిల్ ను కొనుగోలు చేసింది. అయితే ఉత్కంఠ భరితమైన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ జట్టు తేలిపోయింది. అయినప్పటికీ 13 కోట్ల ప్రైజ్ మనీ దక్కించుకుంది. ఇక ఎండార్స్మెంట్ ల ద్వారా వందల కోట్లల్లో వెనకేసుకుంది. అయితే ఈ టోర్నీ ద్వారా తన కాపిటల్ వేల్యూను మరింత పెంచుకున్నట్టు సంస్థ తెలిపింది. అంతేకాకుండా భవిష్యత్తులో భారత దేశంలో నిర్వహించే వివిధ టోర్నీల్లో పెట్టుబడులు పెట్టే విషయమై ఆలోచిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. అయితే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సంస్థ తనకు గణనీయమైన లాభాలు వచ్చాయని చెప్పుకుంది. అయితే ఈక్విటీ ప్రకారం ఎంత వచ్చాయని చెప్పకపోయినప్పటికీ దాదాపు వందల కోట్లలోనే ఆదాయాన్ని సంపాదించుకుందని తెలుస్తోంది.