Women Cricketers: మెన్స్ క్రికెటర్లకు గార్డ్స్.. మరి మహిళా క్రికెటర్ల పరిస్థితి ఏంటి?

సాధారణంగా క్రికెట్ ఆడుతున్నప్పుడు మేల్ బ్యాటర్లు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. హెల్మెట్, గాడ్స్, థైప్యాడ్స్, బ్యాటింగ్ గ్లోవ్స్, కీపింగ్ గ్లోవ్స్ వంటి వాటిని కచ్చితంగా ధరిస్తారు.

Written By: Suresh, Updated On : March 3, 2024 9:00 am
Follow us on

Women Cricketers: క్రికెట్.. చూసే వాళ్లకు వినోదం.. ఆడే వాళ్లకు ప్రమాదం.. సరైన జాగ్రత్త చర్యలు పాటించకపోతే బంతివేగంగా ఎక్కడ తగులుతుందో తెలియదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అంతకన్నా తెలియదు. అటు టెస్ట్, ఇటు వన్డే, మధ్యలో టి20.. ఇలా ఈ ఫార్మాట్ అయినప్పటికీ.. ఆటగాళ్లు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటారు. రక్షణ చర్యలు పాటిస్తారు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హెల్మెట్ పెట్టుకోలేదని టీం ఇండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పై కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత గట్టిగా అరిచాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు క్రికెట్ ఆడుతున్నప్పుడు జాగ్రత్తలు ఎంత అవసరమో.. గతంలో సబా కరీం అనే ఒక కీపర్ హెల్మెట్ ధరించినప్పటికీ బంతి ముక్కుకు బలంగా తగలడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత కెరియర్ కే దూరమయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు.

సాధారణంగా క్రికెట్ ఆడుతున్నప్పుడు మేల్ బ్యాటర్లు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. హెల్మెట్, గాడ్స్, థైప్యాడ్స్, బ్యాటింగ్ గ్లోవ్స్, కీపింగ్ గ్లోవ్స్ వంటి వాటిని కచ్చితంగా ధరిస్తారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రతి క్రికెటర్ ప్రైవేట్ పార్ట్స్ వద్ద గార్డ్ కచ్చితంగా ధరిస్తారు. దాన్ని ధరించడం ఎంత ముఖ్యమో క్రికెటర్లకు తెలుసు.. ఎందుకంటే బంతి ఎలా దూసుకు వస్తుందో తెలియదు. ఎక్కడ తగులుతుందో తెలియదు.. తగిలితే ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఆటగాళ్లు ఆ గార్డ్ అక్కడ ధరిస్తారు.

మొన్నటిదాకా క్రికెట్ ను మగవాళ్ళు మాత్రమే ఆడేవారు. కొంతకాలం నుంచి ఆడవాళ్లు కూడా క్రికెట్ ఆడుతున్నారు. ఐసీసీ కూడా ఆడవాళ్ళ ను క్రికెట్ ఆడే లాగా ప్రోత్సహిస్తున్నది. మగవాళ్లకు మాదిరి గానే ఆడవాళ్లకు మెగా టోర్నీలు నిర్వహిస్తోంది. ఆట ఆడుతున్నప్పుడు ఎవరైనా సరే జాగ్రత్త చర్యలు పాటించాల్సిందే. మరి మగవాళ్ల కంటే ఇన్ని రకాల గార్డ్స్ ఉన్నాయి. మరి ఫిమేల్ ప్లేయర్ల పరిస్థితి ఏంటి? వారు ఎలాంటి గార్డ్స్ ధరిస్తారు? మగవాళ్లకు రెండు తొడల మధ్య ఉండే అవయవాలు ఎంత కీలకమో.. ఆడవాళ్లకు ఉదర భాగంలో ఉండే అవయవాలు కూడా అంతే కీలకం. పైగా ఆ ప్రాంతం ఆడవాళ్లకు అత్యంత సున్నితం.. అందుకే ఫిమేల్ క్రికెటర్లు ఆ ప్రాంతంలో గార్డ్ ధరించకుండా మైదానంలోకి దిగితే అత్యంత ప్రమాదం. వేగంగా వచ్చే బంతి అక్కడ తగిలితే వారికి చాలా ఇబ్బంది.. అందుకే ఫిమేల్ క్రికెటర్లు చెస్ట్ గార్డ్స్ ధరిస్తారు. అది వారి ఆ భాగాన్ని రక్షిస్తుంది. ఇందులో చెప్పుకోవడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆట అనేది వినోదాన్ని పంచాలి. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని పెంపొందించాలి. అంతేతప్ప ప్రమాదాన్ని కొని తేకూడదు.. అందుకే ఆటగాళ్లు సేఫ్టీ గార్డ్స్ ధరిస్తారు.