https://oktelugu.com/

Ram Charan: ఆస్కార్ రేంజ్ హీరో అయినా భార్య కాళ్లు పట్టాల్సిందేనా?

ఇటీవల రామ్ చరణ్ ఉపాసన తమ సొంత విమానంలో వేరే ప్రాంతానికి బయలుదేరారు. ప్రయాణంలో అలసిపోయిందో.. లేక మరేమిటో తెలియదు కానీ ఉపాసన ఇబ్బందిని రామ్ చరణ్ తెలుసుకున్నట్టున్నాడు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 3, 2024 / 09:11 AM IST

    Ram Charan

    Follow us on

    Ram Charan: పురాణాల్లో శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. అలిగిన తన భార్యను తన దారిలోకి తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడ్డాడు. అయినా భార్య కాళ్లు భర్త పట్టుకోవడం ఏంటని అహాన్ని ప్రదర్శించలేదు. నేను దేవుణ్ణి, సర్వాంతర్యామిని అనే గర్వానికి పోలేదు. “దేన్నైనా పుట్టించే శక్తి ఒకటి నేలకి, రెండోది ఆడవాళ్ళకి ఉంది. అలాంటప్పుడు గొడవ ఎందుకు. కాళ్లు పట్టుకుంటే సరిపోతుంది” అని అనుకున్నాడు కాబట్టే కృష్ణుడు సత్యభామకు ఇష్టుడు అయ్యాడు. అందుకే తన భర్త మూర్చ పోయినప్పటికీ కాళ్లు పట్టుకున్నాడనే కనికరంతో యుద్ధం చేసింది. నరకాసురుణ్ణి చంపి మానవాళికి దీపావళి పండుగనిచ్చింది. సరే శ్రీకృష్ణుడు, సత్యభామ పురాణ దేవుళ్ళు. మరి ఈ కాలంలో అలా ఎవరు పట్టుకుంటారు.. అంటే ఆ ప్రశ్నకు ఆస్కార్ హీరో సమాధానం చెప్పాడు.

    రామ్ చరణ్, ఉపాసన ఈ ప్రేమ జంట.. పెళ్లయిన జంట.. పెళ్లయిన చాలా సంవత్సరాల తర్వాత క్లింకారాను పొందిన జంట.. ఎక్కడికి వెళ్లినా సందడి చేస్తూనే ఉంటుంది ఆ జంట. రామ్ చరణ్ ఉపాసనను చూసుకునే విధానం.. ఉపాసన రామ్ చరణ్ కు ఇచ్చే ప్రాధాన్యం ముచ్చట గొలుపుతుంది. ఆ మధ్య తమ కూతురి నామకరణ వేడుకలో ఉపాసన భావోద్వేగానికి గురయితే రామ్ చరణ్ ఓదార్చాడు. ఆ దృశ్యం చాలా మందిని కదిలించింది. ప్రయాణాలు చేయడం అంటే రామ్ చరణ్ కు, ఉపాసనకు చాలా ఇష్టం. ఇద్దరు సరదాగా ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తుంటారు. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.

    ఇటీవల రామ్ చరణ్ ఉపాసన తమ సొంత విమానంలో వేరే ప్రాంతానికి బయలుదేరారు. ప్రయాణంలో అలసిపోయిందో.. లేక మరేమిటో తెలియదు కానీ ఉపాసన ఇబ్బందిని రామ్ చరణ్ తెలుసుకున్నట్టున్నాడు. ఆమె కాళ్ళకు మర్దన చేయడం మొదలుపెట్టాడు. దీనిని ఎవరు ఫోటో తీశారో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇంకేముంది క్షణాల్లో చుట్టేయడం మొదలుపెట్టింది. అసలే స్మార్ట్ ఫోన్ కాలం కాబట్టి.. ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆస్కార్ రేంజ్ హీరో అయినప్పటికీ భార్య కాళ్లు పట్టుకోవాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. ఎంతవారు గాని భార్య ముందు పాదదాసులే అని మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రామ్ చరణ్ సింప్లిసిటీ బాగుందని ఇంకొంతమంది అంటున్నారు. కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్, బుచ్చిబాబు దర్శకత్వంలో ఉత్తరాంధ్ర నేపథ్యంలో రూపొందే ఓ సినిమాలో నటిస్తున్నారు. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.