Homeక్రీడలుక్రికెట్‌GT vs MI: సాయి సుదర్శన్ 4 సార్లు.. శుభ్ మన్ గిల్ వెయ్యి..

GT vs MI: సాయి సుదర్శన్ 4 సార్లు.. శుభ్ మన్ గిల్ వెయ్యి..

GT vs MI : ఇటీవల అహ్మదాబాద్ మైదానంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు ఢిల్లీ చేతిలో ఓటమిపాలైంది. ఢిల్లీ జట్టు చేసిన స్కోర్ ను చేదించే క్రమంలో గుజరాత్ జట్టు విఫలమైంది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్లో తొలి ఓటమిని గుజరాత్ జట్టు నమోదు చేసింది.. ముందుగా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో ఢిల్లీ జట్టు భారీగా పరుగులు చేసింది. దాని దృష్టిలో పెట్టుకొని శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్(Shubh Man Gil) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సాయి సుదర్శన్(Sai Sudarshan) తో కలిసి గిల్ గుజరాత్ జట్టు ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. గిల్(38), సాయి సుదర్శన్ (62*) తొలి వికెట్ కు 8.3 ఓవర్లలోనే 78 పరుగులు చేశారు. 38 పరుగులు చేసిన గిల్ హార్థిక్ పాండ్యా బౌలింగ్లో నమన్ ధార్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బట్లర్(Jose butler) (39) పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్ లో రికెల్టన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన షారుఖ్ ఖాన్(9) విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అతడు తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ కథనం రాసే సమయానికి గుజరాత్ జట్టు 18.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

సరికొత్త రికార్డులు..

గుజరాత్ జట్టు ఇన్నింగ్స్ లో కీలక భూమిక పోషించిన సాయి సుదర్శన్, గిల్ సరికొత్త రికార్డులు సృష్టించారు. అహ్మదాబాద్ మ్యాచ్లో 38 పరుగులు చేయడం ద్వారా గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో తక్కువ ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. జాబితాలో బెంగళూరు జట్టు ఒకప్పటి ఆటగాడు బెంగళూరు వేదికపై గేల్19 ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు పూర్తి చేశాడు. గిల్ అహ్మదాబాద్ వేదికగా 20 ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు పూర్తి చేశాడు. హైదరాబాద్ ఒకప్పటి ఆటగాడు డేవిడ్ వార్నర్ ఉప్పల్ మైదానంలో 22 ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు పూర్తి చేశాడు. మొహాలీ వేదికగా 26 ఇన్నింగ్స్ లలో షాన్ మార్ష్ 1000 పరుగులు పూర్తి చేశాడు.

సాయి సుదర్శన్ నాలుగు ఇన్నింగ్స్ లలో..

గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ గడచిన 4 ఇన్నింగ్స్ లలో పరుగుల వరద పారించాడు. అహ్మదాబాద్ వేదికగా గడిచిన నాలుగు ఇన్నింగ్స్ లలో సాయి సుదర్శన్ 84(48)*, 103(51), 74(41),63(41) పరుగులు చేశాడు. ఇదే వేదిక పై గిల్ లాంటి ఆటగాడికి సాధ్యం కాని రికార్డును సాయి సుదర్శన్ సొంతం చేసుకున్నాడు.

Also Read : చేసింది 31 పరుగులే ఐనా.. CSK పై విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version