Veera Dheera Soora 2
Veera Dheera Soora 2 : తమిళ హీరో విక్రమ్(Chiyaan Vikram) కి చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు అనే సంగతి అందరికీ తెలిసిందే. రజినీకాంత్(Superstar Rajinikanth), కమల్ హాసన్(Kamal Hassan), సూర్య(Suriya Sivakumar) తర్వాత సౌత్ ఇండియా మొత్తం మంచి మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకరు ఆయన. అందుకే విక్రమ్ సినిమా అంటే ఇప్పటికీ థియేటర్స్ కి కదిలి వెళ్లే ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. కానీ ఆయన కమర్షియల్ ఫార్మటు లో సినిమాలు తీసి చాలా కాలమే అయ్యింది. కేవలం నటనతో ప్రయోగాలు చేసే స్కోప్ ఉన్న సినిమాలనే ఇది వరకు ఆయన చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు ఇవి ఆయనకు వరుస విజయాలను తెచ్చి పెట్టి ఉండొచ్చేమో కానీ, ఇప్పుడు మాత్రం ఆయన కెరీర్ ని పాతాళంలోకి తొక్కేలా చేసాయి. ఆయన గత చిత్రం ‘తంగలాన్’ భారీ అంచనాల నడుమ విడుదలై ఫ్లాప్ గా నిల్చింది.
Also Read : కోర్ట్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఓవర్సీస్ లో పవన్ రికార్డు అవుట్!
కానీ ఈ సినిమాకు ఓపెనింగ్ వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. కానీ రీసెంట్ గా విడుదలైన ‘వీర ధీర సూర 2′(Veera Dheera Soora 2) చిత్రం మాత్రం ఓపెనింగ్స్ దారుణమైన ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. ‘తంగలాన్’ చిత్రానికి మొదటి రోజు తమిళనాడు లో 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, ‘వీర ధీర సూర 2’ కి కనీసం రెండు రోజులకు కలిపి 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. మొదటి రోజు రెండు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడితే, రెండవ రోజు ఈ చిత్రానికి 3 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూలు వచ్చాయి కదా, అంటే సినిమా పాజిటివ్ టాక్ ఉంది, ఓపెనింగ్స్ బాగాలేకపోయిన, లాంగ్ రన్ లో బాగా ఆడుతుంటుంది అనుకోని పొరపాటు పడకండి.
మొదటి రోజు ఈ చిత్రం పలు ఫైనాన్సియల్ సమస్యల కారణంగా సాయంత్రం వరకు షోస్ పడలేదు. సాయంత్రం 4 నుండి అటు తమిళనాడు లో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో షోస్ మొదలయ్యాయి. అందుకే మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లు వచ్చినట్టుగా మీకు అనిపిస్తుంది. మూడవ రోజు కూడా ఎలాంటి గ్రోత్ ని కనబర్చలేకపోయింది ఈ చిత్రం. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి కేవలం 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ‘తంగలాన్’ చిత్రం కేవలం తమిళనాడు లో మొదటి రోజు రాబట్టిన వసూళ్లను, ఈ చిత్రం రెండు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా కూడా రాబట్టింది. ఇది విక్రమ్ రేంజ్ కి చాలా అవమానకరం. రాబోయే రోజుల్లో అయినా ఆయన సరైన బ్లాక్ బస్టర్ తో కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.
Also Read : వెంకటేష్, ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా!