RCB vs CSK : 2008లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓడించింది. ఆ తర్వాత మళ్లీ చెన్నై జట్టును బెంగళూరు ఓడించడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో ముందుగా బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ రజత్ పాటి దార్(51), ఫిల్ సాల్ట్( 32), విరాట్ కోహ్లీ(31) చివరి ఓవర్లో టిమ్ డేవిడ్ (22*) దూకుడు కూడా సాగించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ (3/36), మతీష పతిరణ(2/36) అదరగొట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ చెత్త ఫీల్డింగ్ బెంగళూరు జట్టుకు వరంగల్ మారింది. రజత్ పాటిదార్ ఇచ్చిన మూడు క్యాచ్ లను చెన్నై ఆటగాళ్లు వదిలేశారు. సామ్ కరణ్ బౌలింగ్లో టీమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి.. బెంగళూరు జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. 197 టార్గెట్ తో రంగంలోకి దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 నష్టానికి 146 రన్స్ చేసింది. రచిన్ రవీంద్ర(41), ధోని (30*) మిగతా వారంతా ఏమాత్రం సత్తా చూపించలేకపోయారు. హేజిల్ వుడ్(3/21), యశ్ దయాళ్(2/18), లివింగ్ స్టోన్ (2/28), భువనేశ్వర్ కుమార్ (1/18) చెన్నై జట్టు ఓటమిలో ముఖ్యపాత్ర పోషించారు..
Also Read : ధోని 30 రన్స్ చేసినా.. అభిమానుల్లో ఈ ఆవేదన ఏంటి?
శుభారంభం దక్కలేదు
టార్గెట్ చేజ్ చేసేందుకు రంగంలోకి దిగిన చెన్నై జట్టుకు ఆశించినంత స్థాయిలో ఆరంభం లభించలేదు. ఒకే ఓవర్లో రాహుల్ త్రిపాఠి (5), రుతు రాజ్ గైక్వాడ్ (0) ను హజెల్ వుడ్ ఒకే ఓవర్ లో వెనక్కి పంపించాడు దీపక్ హుడా(4) ను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. దీంతో చెన్నై జట్టు ఒక్కసారిగా ఒత్తిడికి గురైంది. వికెట్లు పడిపోకుండా ఆచితూచి ఆడింది. పవర్ ప్లే లో మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై జట్టు 30 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇదే లోయస్ట్ పవర్ ప్లే స్కోర్. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ.. మరో ఆటగాడు సామ్ కరణ్(8) ను లివింగ్ స్టోన్ అవుట్ చేశాడు. క్రీజ్ లోకి వచ్చిన శివమ్ దూబే దూకుడుగా ఆడుతున్న నేపథ్యంలో.. స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో రజత్ పాటిదార్ యశ్ దయాళ్ ను రంగంలోకి దిగి నుంచి నూతన సాధించారు. రచిన్ రవీంద్ర (41), శివమ్ దూబే(19) ను ఒకే ఓవర్ లో యష్ దయాల్ అవుట్ చేశాడు. దీంతో చెన్నై జట్టు ఓటమి అప్పటికే ఖాయమైంది. చివర్లో ధోని వచ్చి మెరుపులు మెరిపించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరి ఓవర్లో ధోని వరుసగా రెండు సిక్సర్లు, ఒక 4 కొట్టి అభిమానుల్లో జోష్ నింపాడు.. అదే ఈ సీజన్లో ఇప్పటివరకు బెంగళూరు వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇదే స్థిరత్వాన్ని బెంగళూరు సాధిస్తుందా? లేక ఆరంభ శూరత్వంగా మిగులుతుందా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది. అయితే గతంలో కూడా బెంగళూరు జట్టు ఇలాగే ఆడి.. చివర్లో చేతులెత్తేసిన విషయం తెలిసిందే. గత సీజన్లో కూడా వరుసగా మ్యాచులు గెలిచిన బెంగళూరు.. చివర్లో ఓటమి పాలయింది.
Also Read : చేసింది 31 పరుగులే ఐనా.. CSK పై విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు