Shubman Gill IPL 2023
Shubman Gill IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత ఎడిషన్ లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సుబ్ మన్ గిల్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్ లో మూడు సెంచరీలతో కదం తొక్కిన ఈ యంగ్ తరంగ్.. గుజరాత్ జట్టు సాధించిన అనేక విజయాల వెనక గిల్ ఉన్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్న గిల్ మరో రికార్డును తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఆ అరుదైన రికార్డు ఏంటో మీరు చదివేయండి.
గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న సుబ్ మన్ గిల్ అద్భుతమైన ఆట తీరు కనబరుస్తున్నాడు. కెరీర్ లోనే బెస్ట్ అనదగ్గ ఇన్నింగ్స్ లు ఆడుతూ ప్రత్యర్థి జట్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో కీలక ఇన్నింగ్స్ లు ఆడి గుజరాత్ కు గొప్ప విజయాలను అందించి పెట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టి విజయాన్ని అందించగా, తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లోనూ అద్వితీయమైన శతకంతో గుజరాత్ జట్టును ఫైనల్ కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే గిల్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నాడు.
డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ను అధిగమించిన గిల్..
ఒకే సీజన్ లో మూడు సెంచరీలు బాదిన సుబ్ మన్ గిల్.. మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో క్వాలిఫైయర్ లో ముంబై ఇండియన్స్ జట్టుపై గిల్ 129 పరుగులు సాధించాడు. దీంతో ఐపీఎల్ ప్లే ఆఫ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్ గా రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ను గిల్ అధిగమించాడు. గతంలో పంజాబ్ తరఫున ఆడిన సెహ్వాగ్.. 2014 సీజన్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో చెన్నైపై 122 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా ఉంది. తాజాగా గిల్ ముంబై జట్టుపై 129 పరుగులు చేయడంతో సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేశాడు. అయితే ఐపీఎల్ లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్ గా మాత్రం కేఎల్ రాహుల్ (132) కొనసాగుతున్నాడు. నాలుగు పరుగుల దూరంలో గిల్ ఈ రికార్డును చేజార్చుకున్నాడు.
రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో అనేక విశేషాలు..
రెండో క్వాలిఫైయర్ ముంబై – గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో అనేక విశేషాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం ఏడుసార్లు గుజరాత్ శతక భాగస్వామ్యం నమోదు చేయగా, ఇందులో గిల్, సాయి సుదర్శన్ మధ్య మూడు సార్లు ఉన్నాయి. ముంబైపై రెండో వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఇక ఆరు సార్లు శతక భాగస్వామ్యాల్లో గిల్ ఉండటం గమనార్హం. ప్లే ఆఫ్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో పది సిక్సులు కొట్టాడు. అంతకు ముందు సాహా 2014 సీజన్ ఫైనల్లో కేకేఆర్ పై 8 సిక్సులు కొట్టాడు. ఇప్పుడు వీరిద్దరూ గుజరాత్ ఓపెనర్లుగా కొనసాగుతున్నారు. అలాగే భారత బ్యాటర్లలో 100 కంటే ఎక్కువ బౌండరీలు బాదిన రెండో బ్యాటర్ గా గిల్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో గిల్ ఇప్పటి వరకు 111 బౌండరీలు కొట్టాడు. అతడి కంటే ముందు విరాట్ కోహ్లీ (122) ఉన్నాడు. ఫైనల్ లోను మరో 12 కొడితే విరాట్ ను గిల్ అధిగమిస్తాడు. ప్లే ఆఫ్ లో అత్యధిక స్కోరు నమోదు చేసిన టీమ్ గా గుజరాత్ టైటాన్స్ రికార్డు సృష్టించింది. ముంబైపై 233/3 స్కోర్ చేసింది. ఆ తర్వాత 2014 సీజన్ లో సీఎస్కేపై పంజాబ్ 256/6, డెక్కన్ చార్జర్స్ పై సీఎస్కే 222/5 స్కోర్ చేసింది. ప్లే ఆఫ్ లో ఒకే మ్యాచ్ లో ఎక్కువ పరుగులు నమోదైన మూడో మ్యాచ్ ఇది. ముంబై – గుజరాత్ మ్యాచ్ లో ఇరు జట్లు కలిపి 404 పరుగులు చేశాయి. ఇంతకు ముందు పంజాబ్ – చెన్నై 2014 సీజన్ క్వాలిఫైయర్-2 మ్యాచ్ లో 428 పరుగులు, 2016 ఐపీఎల్ ఫైనల్ లో హైదరాబాద్ – బెంగళూరు జట్లు 408 పరుగులు చేశాయి. ఈ సీజన్ లో సూర్య కుమార్ యాదవ్ చేధనలో సమయంలో 189.18 స్ట్రైక్ రేటుతో పరుగులు చేశాడు. మొత్తం 10 ఇన్నింగ్స్ ల్లో 420 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 83. అలాగే ఈ సీజన్ లో అత్యధిక స్ట్రైక్ రేటు 181.13 కూడా సూర్య కుమార్ యాదవ్ ది కావడం విశేషం. మోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీశాడు. గుజరాత్ తరపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే. డెత్ ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా మారాడు. మోహిత్ 14 వికెట్లు తీయగా చెన్నై బౌలర్ పతిరానా 16 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ లో కూడా గుజరాత్ – చెన్నై మ్యాచ్ ఉండటంతో వీరిద్దరిలో ఎవరు టాపర్ గా మారుతారో వేచి చూడాలి. ఐపీఎల్ ప్లే ఆఫ్ లో అత్యధిక తేడా నమోదైన ఐదో మ్యాచ్ ఇది. ముంబైపై గుజరాత్ 62 పరుగులు తేడాతో గెలిచింది. గతంలో 2008 సెమీఫైనల్ లో డెక్కన్ చార్జర్స్ పై రాజస్థాన్ రాయల్స్ 105 పరుగులు తేడాతో విజయం సాధించింది.
Web Title: Gt vs mi qualifier 2 shubman gill is doing well in ipl
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com