GT vs MI : గుజరాత్ జట్టులో ఓపెనర్లు సాయి సుదర్శన్ (63), గిల్(38) అదరగొట్టారు.. ఆ తర్వాత వచ్చిన బట్లర్ (39) వేగంగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారీ అంచనాలు ఉన్న రాహుల్ తేవాటియ (0) హార్థిక్ పాండ్యా చేతిలో రన్ అవుట్ అయ్యాడు. రూథర్ఫర్డ్ (18) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆల్ రౌండర్ గా పేరుపొందిన రషీద్ ఖాన్(6) కూడా విఫలమయ్యాడు. ఫలితంగా గుజరాత్ జట్టు 200 స్కోర్ కు నాలుగు పరుగుల దూరంలోనే ఇన్నింగ్స్ ముగించింది. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు సాధించాడు. అయితే తొలి మ్యాచ్ కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా.. రెండో మ్యాచ్లో సొంత నిర్ణయాలు పక్కనపెట్టి రోహిత్ శర్మ సూచనలు తీసుకున్నాడు. ఫలితంగా గుజరాత్ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది.
Also Read : రోహిత్ సూచన పాటించిన హార్దిక్.. కట్ చేస్తే మూడు వికెట్లు..
కెప్టెన్ అయిన రోహిత్
రోహిత్ శర్మ పలుమార్లు మైదానంలో సొంత నిర్ణయాలు తీసుకుంటూ కనిపించాడు. వాటిని హార్దిక్ పాండ్యా అమలు చేయడం మొదలుపెట్టాడు. అందువల్లే గుజరాత్ జట్టు 17.5 ఓవర్ల లో 174/4 వద్ద నుంచి 20 ఓవర్లలో 196/8 వద్దకు చేరుకుంది. రాహుల్ తేవాటియ, షారుక్ ఖాన్, రూథర్ఫర్డ్, రషీద్ ఖాన్, రాబాడా వంటి ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. మరో ఎండ్ నుంచి సహకారం లభించకపోవడంతో సాయి సుదర్శన్ కూడా 63 పరుగుల వద్ద బౌల్ట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యుగా అవుట్ అయ్యాడు.. అయితే రోహిత్ శర్మ సూచనల మేరకు సత్యనారాయణ రాజు అనే యువ బౌలర్ వికెట్ సాధించాడు. అప్పటికే రషీద్ ఖాన్ 6 కొట్టి ఊపు మీద ఉన్నాడు. దీంతో సత్యనారాయణ రాజుకు రోహిత్ శర్మ విలువైన సూచనలు చేయడం.. అతడు చెప్పినట్టుగా బంతి వేయడంతో రషీద్ ఖాన్ భారీ షాట్ కు యత్నించాడు. చివరికి హార్దిక్ పాండ్యాకు దొరికిపోయాడు. రోహిత్ సూచనలు చేయడంతోనే సత్యనారాయణ రాజు లైన్ అండ్ లెంగ్త్ తో బంతి వేశాడు. దానిని అంచనా వేయడంలో విఫలమైన రషీద్ ఖాన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. సత్యనారాయణ రాజుకు రోహిత్ శర్మ సూచిస్తున్న సూచనలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తున్నాయి. రోహిత్ శర్మ ఆటగాడిగా కాకుండా నాయకుడిగా వ్యవహరించాడని.. అది హార్దిక్ పాండ్యాకు అర్థమైందని.. సత్యనారాయణ రాజు కూడా అవగతం చేసుకున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ మైదానంలో యాక్టివ్ గా వ్యవహరించడంతో.. గుజరాత్ జట్టు ఆల్రౌండర్ రషీద్ ఖాన్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఎందుకంటే రోహిత్ ఇచ్చిన సూచనల వల్లే సత్యనారాయణ రాజు తెలివిగా బౌలింగ్ చేశాడు. ఆ బంతిని అంచనా వేయలేని రషీద్ ఖాన్ క్యాచ్ అవుట్ అయ్యాడు.
Also Read : ప్రేమ గురించి త్రిష ఆసక్తికరమైన వ్యాఖ్యలు..నిశ్చితార్థం చేసుకుందా?
Just before the wicket ball leader @ImRo45 #GTvMI #RohitSharma #SatyaNarayanaRaju #GTvsMI pic.twitter.com/Zv7yeW5leW
— PSPK DEVOTEE⁴⁵ (@PSPK_DEVOTEES45) March 29, 2025