Trisha : నాలుగు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో కొనసాగుతూ, సౌత్ లో క్రేజీ మూవీస్ లో హీరోయిన్ గా చేస్తూ, కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తున్న నటి త్రిష కృష్ణన్(Trisha Krishnan). ఈమె హీరోయిన్ గా ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటించింది. సౌత్ నుండి కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్న మొట్టమొదటి హీరోయిన్ ఈమె మాత్రమే. ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది. ఇటీవల కాలం లో ఆమె హీరోయిన్ గా నటించిన ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్, ‘లియో’ చిత్రాలు కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కానీ రీసెంట్ గా అజిత్(Thala Ajith) తో చేసిన ‘విడాముయార్చి’ చిత్రం అనుకున్నంత రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఆడలేదు. కానీ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేసే అవకాశాలు మాత్రం ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.
Also Read : రోహిత్ సూచన పాటించిన హార్దిక్.. కట్ చేస్తే మూడు వికెట్లు..
ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటూ వస్తున్నా త్రిష, తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటోని అభిమానులతో పంచుకొని ఆసక్తికరమైన క్వటేషన్ ని పెట్టింది. ‘ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది’ అంటూ ఆమె పెళ్లి కూతురు తరహాలో తల వంచుకొని సిగ్గుపడుతూ ఒక ఫోటో దిగి, దానిని అప్లోడ్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఆమె చేతికి ఉన్నటువంటి ఉంగరం బాగా హైలైట్ అయ్యింది. ఈ ఉంగరాన్ని చూసి అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే నిశ్చితార్థం రహస్యంగా చేసుకున్నట్టు ఉన్నావ్, ఎవరితో చేసుకున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే చాలా కాలం నుండి మీడియా లో త్రిష, విజయ్(Thalapathy Vijay) డేటింగ్ చేసుకుంటున్నట్టు వార్తలు వినిపించాయి.
విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడని, త్రిష తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాడని తమిళ మీడియా ఊదరగొట్టేసింది. దీనిపై అటు త్రిష నుండి కానీ, విజయ్ నుండి కానీ ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఈ రూమర్ మరింత బలపడి సౌత్ మొత్తం పాకేసింది. అయితే విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయన ప్రత్యర్థులు కావాలను కట్టుకథలు అల్లి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని, దీనిని ఎవ్వరూ నమ్మొద్దు అంటూ విజయ్ సన్నిహిత వర్గాలు చెప్పుకొచ్చాయి. అయినప్పట్టికీ కూడా ఈ రూమర్స్ ఆగడం లేదు. ఇకపోతే త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ‘విశ్వంభర’ మూవీ చేస్తుంది. షూటింగ్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ సినిమా అతి త్వరలోనే మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా తో పాటు ఆమె తమిళ హీరో అజిత్ తో కలిసి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రం చేసింది. ఈ సినిమాపై కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఏప్రిల్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read : కోర్ట్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఓవర్సీస్ లో పవన్ రికార్డు అవుట్
Love always wins pic.twitter.com/eLjiFPLVOO
— Trish (@trishtrashers) March 29, 2025