https://oktelugu.com/

GT vs DC : గుజరాత్ vs ఢిల్లీ: ఎవరు గెలుస్తారంటే..

గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం గుజరాత్ జట్టుకు 58 శాతం, ఢిల్లీ జట్టుకు 42% గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండు జట్లు పరస్పరం మూడుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు గుజరాత్, ఒకసారి ఢిల్లీ విజయం సాధించాయి.

Written By:
  • NARESH
  • , Updated On : April 16, 2024 / 11:12 PM IST

    GT vs DC: Who will win Gujarat Titans vs Delhi Capitals?

    Follow us on

    GT vs DC : ఐపీఎల్ సీజన్లో గుజరాత్, ఢిల్లీ జట్ల ప్రయాణం పడుతూ, లేస్తూ సాగుతోంది. పాయింట్లు పట్టికలో గుజరాత్ 6, ఢిల్లీ 9 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు గురువారం రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల సామర్ధ్యాలు ఎలా ఉన్నాయంటే..

    గుజరాత్..

    ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన గుజరాత్ జట్టు.. మూడు ఓటములు, రెండు విజయాలతో తన ప్రయాణాన్ని సాగిస్తోంది. ఈ జట్టు బ్యాటింగ్ భారాన్ని కెప్టెన్ గిల్ మోస్తున్నాడు. ఐదు మ్యాచ్లలో 255 పరుగులు చేశాడు. అతడి తర్వాత సాయి సుదర్శన్ గుజరాత్ బ్యాటింగ్ దళానికి వెన్నెముకగా మారాడు. ఆరు మ్యాచ్లలో 226 పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత రాహుల్ తేవాటియ 103 పరుగులు చేశాడు. వీరు ముగ్గురు తప్ప.. మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించడం లేదు. కీలక సమయంలో చేతులు ఎత్తేస్తుండడం గుజరాత్ జట్టుకు మింగుడు పడటం లేదు. ఎంట్రీ సీజన్లోనే గుజరాత్ కప్ దక్కించుకుంది. గత సీజన్లో రన్నరప్ గా నిలిచింది. కానీ ఈ సీజన్లో ఆ స్థాయిలో ఆటను ప్రదర్శించలేకపోతోంది. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గెలుపొందిన గుజరాత్.. ఆ తర్వాత వరుసగా రెండు ఓటములు ఎదుర్కొంది. మధ్యలో ఒక విజయం, తర్వాత పరాజయంతో ప్రస్తుతం పాయింట్లు పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతోంది. బౌలింగ్ లో మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్ పై ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే వీరు వికెట్లు తీస్తున్నప్పటికీ దారాళంగా పరుగులు ఇస్తున్నారు. మిగతా బౌలర్లు పెద్దగా రాణించడం లేదు. సుశాంత్ మిశ్రా, దర్శన్ నల్కండే వంటి వారు రాణిస్తే బౌలింగ్ విభాగంలో గుజరాత్ జట్టుకు తిరుగు ఉండదు.

    ఢిల్లీ

    ఢిల్లీ జట్టు కథ కూడా సేమ్ గుజరాత్ లాగే ఉంది. ఈ సీజన్లో ఒక గెలుపు, రెండు ఓటములు, మళ్లీ గెలుపు, మరో ఓటమితో ఢిల్లీ జట్టు ప్రయాణం సాగుతోంది. పాయింట్ల పట్టికలో ఈ జట్టు 9వ స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు బ్యాటింగ్ భారాన్ని కెప్టెన్ రిషబ్ పంత్, స్ట్రబ్స్, వార్నర్ మోస్తున్నారు. ఈ సీజన్లో పంత్ 194, స్ట్రబ్స్ 189, వార్నర్ 166 పరుగులు చేశారు. వీరు ముగ్గురు వీరు మాత్రమే కాకుండా మిగతా వారు కూడా రాణించాలని ఢిల్లీ జట్టు కోరుకుంటున్నది. బౌలింగ్లో ఖలీల్ అహ్మద్, కులదీప్ యాదవ్ మాత్రమే రాణిస్తున్నారు. అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ తమ లయను అందుకుంటే, మిగతావారు తమ స్థాయికి తగ్గట్టు ఆడితే ఢిల్లీ జట్టుకు తిరుగు ఉండదు. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని రెండు జట్లూ భావిస్తున్నాయి.

    గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం గుజరాత్ జట్టుకు 58 శాతం, ఢిల్లీ జట్టుకు 42% గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండు జట్లు పరస్పరం మూడుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు గుజరాత్, ఒకసారి ఢిల్లీ విజయం సాధించాయి.

    తుది జట్లు(అంచనా)

    గుజరాత్

    శుభ్ మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, రాహుల్ తేవాటియ, ఉమేష్ యాదవ్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, విజయ్ శంకర్ / వృద్ధిమాన్ సాహా, వేడ్.

    ఢిల్లీ

    రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మెక్ గ్రూక్, అభిషేక్ పొరేల్, కుమార్ కుషాగ్ర, స్టబ్స్, అక్షర్ పటేల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్/ సుమిత్ కుమార్, కులదీప్ యాదవ్.