Horoscope Today: 2024 ఏప్రిల్ 17 బుధవారం రోజున ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. బుధవారం చంద్రుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. అంతేకాకుండా శ్రీరామనవమి సందర్భంగా కొన్ని రాశుల వారికి రాముడి ఆశీస్సులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒక పని కోసం సీరియస్ గా ఉంటారు. ఇతరుల సలహాలు పాటించాలి.
వృషభ రాశి:
ఉద్యోగులు పనిభారంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. ప్రయాణాలు మానుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం:
కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తిలో భాగంగా ఇతరుల నుంచి ముప్పు ఎక్కువ. సమాజంలో గౌరవం పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
కర్కాటకం:
కుటుంబంతో ఉల్లాసంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యో్గులు సీనియర్ల మద్దతు పొందుతారు.
సింహ:
ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బాగుంటుంది.
కన్య:
ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి. పూర్వీకుల ఆస్తుల విషయంలో ఓ వార్త వింటారు. వ్యాపారంపై ఎక్కువగా శ్రద్ధ వహించరు.
తుల:
బంధువులను కలుస్తారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు.
వృశ్చికం:
మాటలను అదుపులో ఉంచుకోవాలలి. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది.
ధనస్సు:
శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుసుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కష్టపడి పనిచేసినా విజయావకాశాలు తక్కువే. వైవాహికత జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది.
కుంభం:
స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. వివాహంపై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం. కొత్త పనిని ప్రారంభిస్తారు.
మీనం:
ఉద్యోగులు కార్యాలయంలో సంతోషంగా ఉంటారు. వ్యాపారుల కీర్తి, ప్రతిష్టతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు. కొన్ని రంగాల వారికి అనకున్న పనులు నెరవేరుతాయి.