Gill and Hardik : శుక్రవారం జరిగిన మ్యాచ్లో ముంబై చివరి వరకు పోరాడింది. ఒక దశలో గుజరాత్ జట్టు గెలుపుకు దగ్గరగా ఉన్నప్పుడు.. ముంబై జట్టు ఒక్కసారిగా గేర్ మార్చింది. ఫలితంగా మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. చివరికి ముంబై జట్టును గెలుపు వరించింది. అంత క్రితం జరిగిన మ్యాచ్లో ముల్లాన్ పూర్ పిచ్ బౌలర్లకు అనుకూలించింది. దీంతో ఆ మ్యాచ్లో పంజాబ్ ఓడిపోవాల్సి వచ్చింది. కానీ శుక్రవారం నాటి మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ముంబై జట్టుకు పిచ్ అత్యంత అనుకూలించింది. అయితే ఇందులో గుజరాత్ జట్టు చేసిన తప్పులు కూడా ఉన్నాయి. ఫీల్డర్లు కనుక క్యాచ్లు జారవిడకుండా ఉంటే గుజరాత్ పట్టు సాధించేది. కానీ కీలక దశలో గుజరాత్ ఫీల్డర్లు తప్పులు చేయడంతో ముంబై జట్టుకు కలిసి వచ్చింది.
ముంబై జట్టు విజయం సాధించిన అనంతరం.. మ్యాచ్ సందర్భంగా జరిగిన ఇన్సైడ్ విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్నది హార్దిక్ పాండ్ – గిల్ మధ్య జరిగిన గొడవ. టాస్ వేసే క్రమంలో వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఒకరికి ఒకరు కనీసం కరచాలనం కూడా చేసుకోలేదు. పలకరించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. బహుశా ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. గుజరాత్ జట్టు తొలిసారి ఐపిఎల్ విజేతగా నిలిచినప్పుడు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించాడు. నాడు గుజరాత్ జట్టుకు సారధిగా హార్దిక్ పాండ్యా ఉన్నప్పుడు గిల్ అందులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. 2023 సీజన్లో గుజరాత్ జట్టు విజేతగా నిలిచింది.
అప్పట్లో వీరిద్దరి మధ్య స్నేహం బాగానే ఉండేది. గుజరాత్ జట్టు నాడు ఛాంపియన్ గా నిలవడంలో గిల్ కీలకపాత్ర పోషించాడు. 2024 సీజన్లో గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యా బయటికి వచ్చాడు. ఇక అప్పటినుంచి గుజరాత్ జట్టుకు గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. 2024 సీజన్లో గుజరాత్ జట్టు అంతగా ఆడలేకపోయింది. ఇక ఈ సీజన్లో ప్రారంభం నుంచి నిలకడైన ఆటతీరుతో గుజరాత్ జట్టు ఆకట్టుకున్నది. సరిగా ప్లే ఆఫ్ దశలో మ్యాచులు ఓడిపోయి ఇబ్బంది పడింది. ఇక ప్లే ఆఫ్ లో గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అయితే గిల్ – హార్దిక్ మధ్య గొడవలు ఏమీ లేవని.. కాకపోతే ఇటీవల కాలంలో వారిద్దరి మధ్య అంతగా సయోధ్య లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ” ఈ సీజన్లో లీగ్ దశలో గుజరాత్ రెండుసార్లు ముంబై జట్టును ఓడించింది. బహుశా దానివల్లే హార్దిక్ పాండ్యా కాస్త కోపంగా ఉండవచ్చు. అందుకే ఇద్దరు సరిగా మాట్లాడుకోలేదు. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదని” క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా గిల్, హార్దిక్ పాండ్యా పెద్దగా మాట్లాడుకోలేదు.. ఏదో ముభావంగా కనిపించారు. గిల్ తో మాత్రం రోహిత్ శర్మ ఉల్లాసంగా మాట్లాడాడు.. రోహిత్ శర్మ భుజం తట్టి గిల్ ను అభినందించాడు.. జట్టును అద్భుతంగా ముందుకు తీసుకొచ్చారు అంటూ ప్రోత్సహించాడు.
Shubman gill involved in ego war with Hardik Pandya Hardik tried to shake his hands but Shubman didn’t because of his fragile ego that too in front of the one who made his t20 career.
— Crasher (@lmao_crx3r) May 30, 2025